Share News

పోలీసు సేవల్లో టెక్నాలజీ విప్లవం

ABN , Publish Date - Oct 29 , 2026 | 05:59 AM

పోలీసు సేవల్లో ఆధునిక సాంకేతికతకు పెద్దపీట వేస్తూ సీఐడీ రూపొందించిన ఏడు డిజిటల్‌ సేవలను డీజీపీ సీవీ ఆనంద్‌ ప్రారంభించారు.

పోలీసు సేవల్లో టెక్నాలజీ విప్లవం
DGP CV Anand

  • జైళ్లనుంచి విడుదలయ్యే ఖైదీలపై నిఘాకు ప్రత్యేక వ్యవస్థ

  • సీఐడీలో ఏడు డిజిటల్‌ సేవలు ప్రారంభించిన డీజీపీ ఆనంద్‌

హైదరాబాద్‌, అక్టోబరు 28(ఆంధ్రజ్యోతి): పోలీసు సేవల్లో ఆధునిక సాంకేతికతకు పెద్దపీట వేస్తూ సీఐడీ రూపొందించిన ఏడు డిజిటల్‌ సేవలను డీజీపీ సీవీ ఆనంద్‌ ప్రారంభించారు. పోలీసు సేవలను వినియోగించుకుంటున్న ప్రజల నుంచి నేరుగా అభిప్రాయాలు తెలుసుకునేందుకు సిటిజన్‌ ఫీడ్‌బ్యాక్‌ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. పిటీషన్లు, ఎఫ్‌ఐఆర్‌ల నమోదు, ఈ చలాన్లు, పాస్‌పోర్టు వెరిఫికేషన్‌ సేవలపై ప్రజల స్పందనను ఈ కేంద్రం సేకరిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో ఉన్న 35 భరోసా కేంద్రాలను అనుసంధానిస్తూ ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ ద్వారా వీటిని ఒక వేదికపైకి తీసుకుని వచ్చారు. బాధితులకు అందించే కౌన్సిలింగ్‌, వైద్య, న్యాయ, పునరావాస సేవల వివరాలు నమోదు చేసి, దీని ద్వారా కేసు ప్రారంభం నుంచి ముగింపు వరకు ఉన్నతాధికారులు పర్యవేక్షించవచ్చు.


కాగితపు రిజిష్టర్లకు బదులుగా రాష్ట్ర స్ధాయి డ్యాష్‌బోర్డును అందుబాటులోకి తేవడం ద్వారా 23 రకాల నివేదికలు పోలీసులందరికి అందుబాటులోకి వచ్చాయి. జైళ్ల నుంచి విడుదలయ్యే ఖైదీల సమాచారాన్ని పోలీసులకు సకాలంలో చేరవేసేందుకు జైలు మానిటరింగ్‌ సిస్టమ్‌ను అందుబాటులోకి తీసుకుని వచ్చారు. దీంతో ఇప్పటికే అమల్లో ఉన్న ఈ ప్రిజన్స్‌ వ్యవస్ధకు నూతన సిస్టమ్‌ను అనుసంధానించారు. నేర పరిశోధనలో ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ఐదు స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసీజర్లు రూపొందించామని డీజీపీ ఆనంద్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో శాంతి భద్రతల విభాగం డీజీపీ భగవత్‌, సీఐడీ డీజీ చారుసిన్హా, ఏడీజీ అకున్‌ సబర్వాల్‌ తదితరులు పాల్గొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

అప్రాధాన్య పోస్టుకు జయేశ్‌ రంజన్‌

దీపావళి తర్వాత భారీ ప్రక్షాళన

ఆ జూనియర్‌ లెక్చరర్లను సర్వీసులోకి తీసుకోండి

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Oct 29 , 2026 | 05:59 AM