‘ఆకాశమే’ హద్దుగా..
ABN , Publish Date - Sep 13 , 2026 | 05:25 AM
ఇప్పటివరకు ఐటీ, లైఫ్ సైన్సెస్, ఫార్మా రంగాలపై దృష్టి సారించిన రాష్ట్ర ప్రభుత్వం.. ఇప్పుడు అంతరిక్ష రంగం (స్పేస్), దాని అనుబంధ విభాగాలపై దృష్టి పెట్టింది.
ఫ్యూచర్‌సిటీలో ‘స్పేస్ సిటీ’ ఏర్పాటుకు చర్యలు
డ్రోన్లు, ఉపగ్రహాలు, రాకెట్లపై రిసెర్చ్, వాటి
తయారీకి ఏర్పాట్లు చేసేందుకు వీలుగా చర్యలు
వాటి అనుబంధ విభాగాలకు భూమి కేటాయింపు
డిసెంబరులో విడుదల చేయనున్న
మాస్టర్‌ప్లాన్‌లో స్పెషల్ జోన్‌గా స్పేస్ సిటీ
హైదరాబాద్, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి): ఇప్పటివరకు ఐటీ, లైఫ్ సైన్సెస్, ఫార్మా రంగాలపై దృష్టి సారించిన రాష్ట్ర ప్రభుత్వం.. ఇప్పుడు అంతరిక్ష రంగం (స్పేస్), దాని అనుబంధ విభాగాలపై దృష్టి పెట్టింది. అంతరిక్ష రంగంలో పెట్టుబడులు తీసుకురావడంతో పాటు స్పేస్ పాలసీని తీసుకురావాలని భావిస్తోంది. ఫ్యూచర్‌సిటీలో ఏఐ సిటీ, ఈవీ, హెల్త్, ఎడ్యుకేషన్, ఎంటర్‌టైన్‌మెంట్ సహా పలు ప్రత్యేక జోన్‌లను ఏర్పాటుచేసే దిశగా ప్రణాళికలు రూపొందిస్తున్న సర్కారు.. అక్కడ ‘స్పేస్ సిటీ’ పేరుతో ఒక క్లస్టర్‌ను ఏర్పాటుచేసేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం.
అందులో.. ఇన్నోవేషన్ హబ్, మాన్యుఫ్యాక్చరింగ్ జోన్, టెస్టింగ్ జోన్, ఏరోస్పే్‌స-డిఫెన్స్ జోన్, నాలెడ్జ్ హబ్ పేరుతో 5 సెంటర్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేయనున్నట్టు తెలిసింది. మాస్టర్‌ప్లాన్‌లోనూ ఇదే విధంగా జోన్‌ల కేటాయింపు ఉండొచ్చని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే దీనికి ఎన్ని ఎకరాలను కేటాయిస్తారన్నది తెలియాల్సి ఉంది. అక్కడ.. డ్రోన్లు, ఉపగ్రహాలు, రాకెట్లకు సంబంధించిన పరిశోధన, వాటి తయారీకి అవసరమైన ఏర్పాట్లు చేసేందుకు, వాటి అనుబంధ విభాగాలకు క్లస్టర్లవారీగా భూకేటాయింపులు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు సమాచారం. ఈమేరకు.. డిసెంబరులో విడుదల చేయనున్న భారత్ ఫ్యూచర్‌సిటీ మాస్టర్‌ప్లాన్‌లో స్పేస్ సిటీని స్పెషల్ జోన్‌గా విభజించనున్నట్టు తెలిసింది. ఇటీవల పలు స్పేస్‌టెక్ సంస్థలతో ప్రభుత్వం జరిపిన సమావేశాల్లోనూ ‘స్పేస్ సిటీ’ అంశంపై పరిశ్రమల ప్రతినిధులు ప్రత్యేకంగా ప్రస్తావించినట్టు తెలిసింది.
క్లస్టర్‌లో ఇలా..
ప్రపంచవ్యాప్తంగా ఏరోస్పేస్ రంగానికి డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ కూడా ఈ రంగంలో తన వాటాను పెంచుకోవాలని భావిస్తోంది. అంతరిక్ష రంగాన్ని కీలక ఆర్ధిక వృద్ధి ఇంజిన్‌గా మార్చుకోవాలన్న నిర్ణయానికి వచ్చింది. ఈమేరకు.. విమానాలు, అంతరిక్ష రంగం, రక్షణ అవసరాలకు ఉపయోగపడే పరికరాలు, విడిభాగాలు, అత్యాధునిక తయారీ రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రత్యేక వ్యూహంతో ముందుకు సాగుతోంది. ఇప్పటికే హైదరాబాద్‌లో రక్షణ, ఏరోస్పేస్ రంగాలకు సంబంధించిన పలు సంస్థలు, పరిశోధన కేంద్రాలు ఉన్న సంగతి తెలిసిందే. ఈ అవకాశాలను మరింత విస్తరించి, ప్రపంచవ్యాప్తంగా ఈ రంగంలో ఉన్న అగ్రశ్రేణి కంపెనీలను తెలంగాణకు తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలోనే ఫ్యూచర్‌సిటీలో స్పేస్ క్లస్టర్ ఏర్పాటు అంశం తెరమీదకు వచ్చింది. ఏరోస్పే్‌స-డ్రోన్-స్పే్‌స రంగాలు మూడు వేర్వేరుగా కనిపిస్తున్నా.. సాంకేతికంగా ఒకదానికొకటి అనుబంధంగా పనిచేస్తాయి. ఆ కారణంగానే ఈ మూడింటిని కలిపి ఒక క్లస్టర్‌గా విభజించి, ఒకేచోట స్పేస్ సిటీని నిర్మించేలా ప్రభుత్వం నిర్ణయించినట్టు సమా చారం. వెరసి స్పేస్ సిటీ ఏర్పాటుతో రాష్ట్ర ఆర్ధికాభిృద్ధి దోహదపడడంతో పాటు ఆయా రంగాల్లో కీలకంగానూ మారే అవకాశాలున్నాయని కూడా ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి:
ఆర్టీసీ ‘ప్రత్యేక’ బాదుడు!
సురేఖకు అధిష్ఠానం పిలుపు!
Read Latest AP News And Telangana News And International News And Telugu News