Share News

రాజీ మార్గంలో సమస్యలకు పరిష్కారం

ABN , Publish Date - Sep 13 , 2026 | 01:05 AM

ప్రజలు చిన్నచిన్న వివాదాలను పెద్దవిగా చేసుకుని శారీరకంగా, ఆర్థికంగా, మానసికంగా నష్టపోకుండా పరస్పర అవగాహనతో రాజీమార్గంలోనే సమస్యలకు శాశ్వ త పరిష్కరించుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, సేవాధికార సంస్థ అధ్యక్షురాలు పి. నీరజ కోరారు.

రాజీ మార్గంలో సమస్యలకు పరిష్కారం

సిరిసిల్ల అర్బన్‌, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి) : ప్రజలు చిన్నచిన్న వివాదాలను పెద్దవిగా చేసుకుని శారీరకంగా, ఆర్థికంగా, మానసికంగా నష్టపోకుండా పరస్పర అవగాహనతో రాజీమార్గంలోనే సమస్యలకు శాశ్వ త పరిష్కరించుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, సేవాధికార సంస్థ అధ్యక్షురాలు పి. నీరజ కోరారు. సిరిసిల్ల జిల్లా కోర్టులో శనివారం జాతీయ లోక్‌అదాలత్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధా న న్యాయమూర్తి మాట్లాడుతూ సుప్రీం కోర్టు, హైకోర్టుల ఆదేశాల మేరకు జాతీయ లోక్‌అదాలత్‌ను నిర్వహించామన్నారు. జాతీయ లోక్‌అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పోక్సో నాయ్యమూర్తి రాధిక జైస్వాల్‌ మాట్లాడుతూ కోర్టులలోని కేసులను పరస్పర రాజీమార్గంలో పరి ష్కరించుకోవడం వల్ల ఇరుపక్షాలకు సమయం, ఖర్చులు అదా అవుతాయ న్నారు. ఈ లోక్‌అదాలత్‌లో 12వేల 666 కేసులను పరిష్కరించి బాధితుల కు రూ.2కోట్ల 2లక్షల 72వేల 283 నష్టపరిహారాన్ని ఇప్పించినట్లు జిల్లా ప్రధానన్యాయమూర్తి నీరజ తెలిపారు. ఇందులో మోటార్‌ వాహన ప్రమా దాలకు సంబంధించిన 17కేసులు, సివిల్‌ తగాదాలు 12, క్రిమినల్‌ కేసులు 213, ఎక్సైజ్‌ కేసులు 29, చెక్‌బౌన్స్‌ కేసులు 4, గృహహింస కేసులు 1, సైబర్‌ క్రైం కేసులు 22, బ్యాంకు కేసులు 49, డ్రంకెన్‌ డ్రైవ్‌ కేసులు 860, ట్రాఫిక్‌ చలాన్‌ కేసులు 11వేల 456, టెలిఫోన్‌ కేసులు 3లను పరిష్కరించి నట్లు తెలిపారు. ఈ లోక్‌అదాలత్‌లో సీనియర్‌ సివిల్‌ జడ్జి లక్ష్మణాచారి, వేములవాడ సీనియర్‌ సివిల్‌జడ్జి అజయ్‌కుమార్‌ జాదవ్‌, జూనియర్‌ సివిల్‌ జడ్జి మేఘన, బార్‌అసోషియేషన్‌ అధ్యక్షుడు అవునూరి రమాకాం త్‌రావు, సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్రచారి, లోక్‌అదాలత్‌ సభ్యులు చింతోజు భాస్కర్‌, న్యాయవాదులు పాల్గొన్నారు.

Updated Date - Sep 13 , 2026 | 01:05 AM