‘సర్’ విచారణలో వెనకబాటు
ABN , Publish Date - Sep 13 , 2026 | 02:08 AM
ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) విచారణలో జిల్లా వెనకబడి ఉంది. సర్ ప్రక్రియలో మృతులు, ఓట్లు, చిరునామా లేని, వలస వెళ్లిన ఓటర్లను తొలగించి ముసాయిదా జాబితా వెల్లడించడంతోపాటు నో-మ్యాపింగ్, అనామాలిస్ ఓటర్లకు నోటీసులు జారీ చేసి హియరింగ్ ప్రక్రియ చేపట్టారు.
- వేగంగా నోటీసుల జారీ..
- హియరింగ్‌కు ఆసక్తి చూపని ఓటర్లు
- జిల్లా వ్యాప్తంగా 83,846 నోటీసులు.. 73379 నోటీసుల పంపిణీ
- పెండింగ్‌లో 10467 నోటీసులు
- ఇప్పటివరకు రుజువు చూపిన ఓటర్లు 21592 మంది
- నవంబర్ 9న తుది ఓటర్ జాబితా వెల్లడి
(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)
ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) విచారణలో జిల్లా వెనకబడి ఉంది. సర్ ప్రక్రియలో మృతులు, ఓట్లు, చిరునామా లేని, వలస వెళ్లిన ఓటర్లను తొలగించి ముసాయిదా జాబితా వెల్లడించడంతోపాటు నో-మ్యాపింగ్, అనామాలిస్ ఓటర్లకు నోటీసులు జారీ చేసి హియరింగ్ ప్రక్రియ చేపట్టారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ రెండు నియోజకవర్గాల్లో నోటీసుల జారీ వేగంగా పూర్తి చేశారు. నోటీసులు అందుకున్న ఓటర్లు మాత్రం హియరింగ్‌కు ఆసక్తి చూపడం లేదు. ఎన్నికల కమిషన్ సూచించిన ఏదైనా రుజువు చూపిస్తేనే ఓటు హక్కు ఉంటుందని ప్రచారం చేసిన ఓటర్లు ముందుకు రావడం లేదు. జిల్లాలో నోటీసులు జారీ ఎంతో వేగంగా పూర్తి చేసిన విచారణ మాత్రం వెనకబాటుగానే ఉంది. నోటీసులు అందుకున్న ఓటర్లు ఆధారం చూపే పత్రాలు అందించడానికి రెండు విడతలుగా ప్రత్యేక శిబిరాలను సైతం నిర్వహించారు. వేగంగా పూర్తి చేయడానికి ఎన్నికల సంఘం బీఎల్‌వోలకు ప్రత్యేక యాప్‌లు ఇచ్చారు. ఓటర్లు నోటీసులకు సమాధానం ఇవ్వడానికి ఆసక్తి చూపకపోవడంతో జిల్లాలో నత్తనడగానే విచారణ సాగుతోంది.
విచారణకు రాని 41272 మంది ఓటర్లు
రాజన్న సిరిసిల్ల జిల్లాలో నోమ్యాపింగ్, అనామాలిస్ కింద 83846 మంది ఓటర్లకు నోటీసులు జారీ చేయాల్సి ఉండగా 73379 మంది ఓటర్లకు నోటీసులు జారీ చేశారు. ఇంకా 10467 నోటీసులు పెండింగ్‌లో ఉన్నాయి. నోటీసులు అందుకున్న వారిలో ఇప్పటివరకు కేవలం 21592 మంది మాత్రమే సంబంధిత ఆధారాలు అప్పగించారు. 41272 మంది ఓటర్లు ధ్రువీకరణ పత్రాలు ఇవ్వడానికి ఆసక్తి చూపలేదు. సిరిసిల్ల నియోజకవర్గంలో 53278 నోటీసులకు 44434 మంది ఓటర్లకు నోటీసులు ఇచ్చారు. ఇందులో 8844 నోటీసులు పెండింగ్‌లో ఉన్నాయి. నోటీసులు అందుకున్న వారు తగిన ఆధారాలతో 7427 మంది హాజరయ్యారు. 33722 మంది ఆసక్తి చూపలేదు. వేములవాడ నియోజకవర్గంలో 30568 నోటీసులకు 28945 నోటీసులు జారీ చేశారు ఇంకా 1623 నోటీసులు పెండింగ్‌లో ఉన్నాయి. విచారణకు 14165 మంది హాజరుకాగా 7550 మంది ఆసక్తి చూపలేదు. నోటీసులు అందుకున్న వారిలో చిన్న పొరపాట్లే ఎక్కువగా ఉన్నాయి. ఒక్క అక్షరం తప్పుగా ఉన్నవారే అధికంగా ఉన్నారు. ఉదాహరణకు తండ్రి పేరు రాజయ్యకు బదులుగా రాజాయ్య అని ఉంటే నోటీసు వచ్చింది. వి అక్షరానికి బదులుగా యు అక్షరం పడినా అది తప్పుగానే తీసుకొని నోటీసులు జారీచేశారు. తెలుగు అక్షరాలు ఇంగ్లీషులో రాసినప్పుడు కొమ్ములు, దీర్ఘాలు, ఒత్తులు తప్పుగా కనిపించడం సహజం. ఎన్నికల సంఘం సాఫ్ట్‌వేర్ వాటిని పొరపాట్లుగానే భావించి నోటీసులు జారీ చేయడం ఓటర్లకు ఇబ్బందిగా మారింది. దీంతో నోటీసులు అందుకున్న ఓటర్లు ధ్రువీకరణ పత్రాల కోసం పరుగులు పెడుతున్నారు. టెన్త్ సర్టిఫికెట్లు, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ బ్యాంక్ పాస్ పుస్తకాలు పాస్‌పోర్ట్, నివాసం కులం ఇలా అనేక పత్రాలను అధికారులు అడుగుతుండంతో వాటికోసం ఓటర్లు పరుగులు తీస్తున్నారు. నోటీసులు, క్లెయిమ్స్‌కు సంబంధించిన ప్రక్రియ అక్టోబరు 17వ తేదీ వరకు కొనసాగిస్తారు. నవంబరు 5న ప్రక్రియ ముగించి, తుది ఓటర్ జాబితాను 9వ తేదీన వెల్లడిస్తారు. డ్రాఫ్ట్ ఓటర్ జాబితా ప్రకారం సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాల్లో 417303 మంది ఓటర్లు ఉండగా పురుషులు 202580 మంది, మహిళలు 214526 మంది ఉన్నారు. ఇతరులు 21 మంది ఉండగా, సర్వీస్ ఓటర్లలో పురుషులు 169 మంది, మహిళలు ఏడు మంది ఉన్నారు. వేములవాడ నియోజకవర్గంలో 202386 మంది ఉండగా, పురుషులు 97539 మంది, మహిళలు 104766 మంది ఉన్నారు. ఇతరులు 18మంది ఉండగా, సర్వీస్ ఓటర్లలో పురుషులు60 మంది, మహిళలు ముగ్గురు ఉన్నారు. సిరిసిల్ల నియోజకవర్గంలో 214917మంది ఉండగా, పురుషులు 105041 మంది, మహిళలు 109760 మంది ఉన్నారు. ఇతరులు ముగ్గురు ఉండగా, సర్వీస్ ఓటర్లలో పురుషులు 109 మంది, మహిళలు నలుగురు ఉన్నారు.రెండు సెగ్మెంట్లలో డ్రాఫ్ట్ నోటిపికేషన్ ప్రకారం 417303 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 202580 మంది, మహిళలు 214526 మంది, థర్డ్ జెండర్‌లు 21 మంది ఉన్నారు. వారిలో 11953 మంది మహిళ ఓటర్లే అధికంగా ఉన్నారు. సిరిసిల్ల నియోజకవర్గంలో 214917మంది ఓటర్లు ఉండగా, పురుషులు 105041 మంది, మహిళలు 109764 మంది, థర్డ్ జెండర్‌లు నలుగురు ఉన్నారు. వీరిలో 4723 మమహిళలు అధికంగా ఉన్నారు. వేములవాడ నియోజకవర్గంలో 202386 మంది ఓటర్లు ఉండగా, పురుషులు 97599 మంది, మహిళలు 104769 మంది, థర్డ్ జెండర్‌లు ముగ్గురు ఉన్నారు. వీరిలో 7230 మహిళలు అధికంగా ఉన్నారు.
జిల్లాలో 58567 మంది ఓట్లు తొలగింపు
జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాల్లో ‘సర్’ ప్రక్రియ ప్రారంభానికి ముందు 475694 మంది ఓటర్లు ఉన్నారు. వీరికి అడ్మిషన్ ఫారాలు పంపిణీ చేసి తిరిగి డిజిటలైజేషన్‌లో 417127 మంది ఓటర్లు అర్హులుగా గుర్తించి ముసాయిదా ఓటర్ జాబితాను వెల్లడించారు. దీని ప్రకారం రెండు నియోజకవర్గాల్లో 58 వేల 567 మంది ఓటర్లు తొలగిపోయారు. ఇందులో 12 వేల 791 మంది మృతిచెందిన వారు. జిల్లా నుంచి శాశ్వతంగా వెళ్లిపోయిన వారు 25926 మంది, డబుల్ ఓటర్లు 10 వేల 62 మంది, ఆచూకీ దొరికిన ఓటర్లు 9098 మంది ఉన్నారు. ఇందులో సిరిసిల్ల నియోజకవర్గంలో 2లక్షల 14వేల 917 మంది ఓటర్లు ఉన్నారు. తొలగించిన ఓటర్లలో మృతులు 6032 మంది ఉన్నారు. శాశ్వతంగా వెళ్లిపోయిన వారు 15452 మంది, డబుల్ ఓటర్లు 5017మంది, ఆచూకీ దొరకని ఓటర్లు 4997 మంది ఉన్నారు. ఇతరుల జాబితాలో 260 మంది ఓటర్లను చేర్చారు. వేములవాడ నియోజకవర్గంలో 2 లక్షల 2386 మంది ఓటర్లు ఉన్నారు. తొలగించిన ఓటర్లలో మృతులు 6759 మంది ఉన్నారు. శాశ్వతంగా వెళ్లిపోయిన వారు 10474 మంది, డబుల్ ఓటర్లు 5045మంది, దొరకని ఓటర్లు 4101 మంది ఉన్నారు. ఇతరుల జాబితాలో 430 మంది ఓటర్లను చేర్చారు. తొలగించిన ఓటర్లలో మృతులు 12791 మంది ఉండగా, శాశ్వతంగా వలస వెళ్లినవారు 25926 మంది ఉన్నారు. వలస ఓటర్లలో సిరిసిల్ల నియోజకవర్గంలో 10474 మంది, వేములవాడ నియోజకవర్గంలో 15452 మంది ఉన్నారు. ఇందులో ప్రధానంగా శాశ్వతంగా వలస వెళ్లిన ఓటర్ల జాబితాలో సిరిసిల్ల నుంచి 8153 మంది, వేములవాడలో 3252 మంది ఉన్నారు. వీరందరూ కూడా గ్రామీణ ప్రాంతాల నుంచి పిల్లల చదువులు, వ్యాపారాలు, ఉద్యోగాలరీత్యా సిరిసిల్ల, వేములవాడ పట్టణాల్లో స్థిరపడ్డవారే తిరిగి తమ సొంత ఊర్లో ఓట్లు ఉండే విధంగా మొగ్గు చూపారని భావిస్తున్నారు. మరికొంతమంది హైదరాబాద్ నగరంలో పూర్తిస్థాయిలో స్థిరపడి అక్కడే ఉండిపోవడంతో జిల్లా నుంచి ఓట్లు బదిలీ చేసుకున్నట్లుగా భావిస్తున్నారు.
జిల్లాలో ఇప్పటి వరకు నోటీసులు, విచారణ ప్రక్రియ లెక్క ఇలా...
వేములవాడ నియోజకవర్గం
మండలం జారీ చేయాల్సిన నోటీసులు జారీ అయినవి పెండింగ్‌లో ఉన్నవి విచారణకు వచ్చినవారు ఆసక్తి చూపని వారు
మేడిపల్లి 4893 4507 386 2508 2277
భీమారం 3554 3206 348 1128 1074
కథలాపూర్ 4709 4554 155 1026 362
రుద్రంగి 1997 1944 53 1825 147
చందుర్తి 1943 1913 30 1500 256
వేములవాడ రూరల్ 1217 1216 01 798 419
వేములవాడ మున్సిపాలిటీ 3616 3422 194 1196 1282
వేములవాడ 3580 3378 202 1849 1253
కోనరావుపేట 5059 4805 254 2335 480
మొత్తం 30568 28945 1623 14165 7550
సిరిసిల్ల నియోజకవర్గం
మండలం జారీ చేయాల్సిన నోటీసులు జారీ అయినవి పెండింగ్‌లో ఉన్నవి విచారణకు వచ్చినవారు ఆసక్తి చూపని వారు
వీర్నపల్లి 2150 2095 55 1086 1064
ఎల్లారెడ్డిపేట్ 9361 6866 2495 696 4288
గంభీరావుపేట్ 7895 7236 659 1506 3793
సిరిసిల్ల 7849 7631 218 1939 5909
సిరిసిల్ల మున్సిపల్ 9306 8058 1248 539 8757
తంగళ్ళపల్లి 9717 6719 2993 338 6530
ముస్తాబాద్ 7005 5829 1176 1323 3381
మొత్తం 53278 44434 8844 7427 33722