Share News

పామాయిల్‌ రైతుల ప్రయోజనమే లక్ష్యం

ABN , Publish Date - Nov 06 , 2026 | 05:54 AM

దేశీయ ఆయిల్‌ పామ్‌ రైతుల ప్రయోజనాలను పరిరక్షించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు.

పామాయిల్‌ రైతుల ప్రయోజనమే లక్ష్యం
Thummala Nageswara Rao

  • కేంద్రం దిగుమతి సుంకాన్ని 44శాతానికి పెంచాలి: తుమ్మల

దేశీయ ఆయిల్‌ పామ్‌ రైతుల ప్రయోజనాలను పరిరక్షించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. విదేశాల నుంచి చౌకగా దిగుమతి అవుతున్న క్రూడ్‌ పామాయిల్‌ వల్ల ఇక్కడి రైతులు నష్టపోయే ప్రమాదం ఉందని, గతంలో 44శాతంగా ఉన్న దిగుమతి సుంకాన్ని తిరిగి ఆ స్థాయికి పెంచాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని మరోసారి కోరారు.


ఆయిల్‌ పామ్‌ దిగుమతి సుంకాలపై తెలంగాణ ప్రభుత్వం వ్యక్తం చేసిన ఆందోళనలను పరిగణనలోకి తీసుకుంటామని కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషి ఇటీవల లేఖ ద్వారా హామీ ఇచ్చినట్లు మంత్రి తుమ్మల వెల్లడించారు. క్రూడ్‌ పామాయిల్‌ దిగుమతి సుంకాన్ని కేంద్రం క్రమంగా తగ్గిస్తూ వచ్చిందని, ఈ ఏడాది సెప్టెంబరులో దానిని 11శాతానికి పడిపోయేలా చేసిందని మంత్రి పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులకు పలుమార్లు లేఖలు రాసి, స్వయంగా కలిసి రైతుల ఇబ్బందిని వివరించినట్లు గురువారం ఒక ప్రకటనలో ఆయన తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

కాళేశ్వరంపై అసెంబ్లీ!

మరో రెండు పథకాలు

కొడంగల్‌లో రేపటి నుంచి సీఎం పర్యటన

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Nov 06 , 2026 | 05:54 AM