Share News

ఆయిల్‌ పామ్‌కు గిట్టుబాటు ధర ఇవ్వాలి

ABN , Publish Date - Nov 18 , 2026 | 04:50 AM

‘‘ఆయిల్‌ పామ్‌ సాగు చేస్తున్న రైతులకు పెరుగుతున్న పెట్టుబడి ఖర్చులకు అనుగుణంగా గిట్టుబాటు ధర కల్పించాలి. రైతులు-కంపెనీల మధ్య ఆదాయ పంపిణీ నిష్పత్తిని ప్రస్తుతమున్న 75:25 నుంచి 80:20కి మార్చాలి.

ఆయిల్‌ పామ్‌కు గిట్టుబాటు ధర ఇవ్వాలి
Thummala Nageswara Rao

  • ఆదాయ పంపిణీని 80:20 నిష్పత్తిగా మార్చాలి

  • మంత్రి తుమ్మలను కలిసిన రైతులు

  • కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని మంత్రి హామీ

హైదరాబాద్‌, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి): ‘‘ఆయిల్‌ పామ్‌ సాగు చేస్తున్న రైతులకు పెరుగుతున్న పెట్టుబడి ఖర్చులకు అనుగుణంగా గిట్టుబాటు ధర కల్పించాలి. రైతులు-కంపెనీల మధ్య ఆదాయ పంపిణీ నిష్పత్తిని ప్రస్తుతమున్న 75:25 నుంచి 80:20కి మార్చాలి. ఆయిల్‌ పామ్‌ గెలలకు టన్నుకు రూ.25,000 కనీస గ్యారంటీ ధర నిర్ణయించాలి’’ అని ఆయిల్‌ పామ్‌ రైతులు కోరారు. ఈ మేరకు మంగళవారం సచివాలయంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావును వారు కలిశారు. కొంతకాలంగా ఎరువుల ధరలు, కూలీల వేతనాలు, సాగుకు అవసరమయ్యే ఇతర పెట్టుబడి ఖర్చులు రెట్టింపయ్యాయని రైతులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు.


ఎల్‌నినో పరిస్థితులతో దిగుబడి తగ్గిందని, పెరుగుతున్న ఖర్చులతో ఆయిల్‌ పామ్‌ సాగు భారంగా మారుతోందని, తమకు తగిన ఆదాయం లభించేలా ధరల నిర్ణయ విధానంలో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని వివరించారు. రైతుల విజ్ఞప్తులపై సానుకూలంగా స్పందించిన మంత్రి తుమ్మల.. ఆదాయ పంపిణీ నిష్పత్తిని 80:20కి మార్చే అంశాన్ని కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. దీనిపై వెంటనే కేంద్ర వ్యవసాయశాఖ కార్యదర్శికి లేఖ రాయాలని రాష్ట్ర వ్యవసాయశాఖ కార్యదర్శి సురేంద్రమోహన్‌ను ఆదేశించారు.


ఇవి కూడా చదవండి...

ఉత్తరాఖండ్‌లో ఘోర బస్సు ప్రమాదం.. వంతెన పైనుంచి లోయలోకి దూసుకెళ్లి..

ముద్దంటూ విదేశీయురాలిని వేధించిన వ్యక్తి.. కట్ చేస్తే జైల్లో..

Read Latest National News And Telugu News

Updated Date - Nov 18 , 2026 | 04:50 AM