Share News

నేడు 4.5 లక్షల మందికి పింఛన్లు

ABN , Publish Date - Nov 08 , 2026 | 03:09 AM

చేయూత పథకం కింద కొత్తగా పింఛన్‌ లబ్ధిదారులుగా ఎంపికైన వారికి రాష్ట్ర ప్రభుత్వం దీపావళి కానుకగా వాటిని అందించనుంది. అర్హులైన మరో 4.5 లక్షల మందికి పింఛన్లు అందజేయనుంది.

నేడు 4.5 లక్షల మందికి పింఛన్లు
Telangana Government

  • దీపావళి కానుకగా కొత్తగా అందించనున్న సర్కారు

  • కొడంగల్‌లో ప్రారంభించనున్న సీఎం రేవంత్‌రెడ్డి

  • లబ్ధిదారులకు ఈ నెల నుంచే పింఛన్‌ అందజేత

హైదరాబాద్‌, నవంబరు 7 (ఆంధ్రజ్యోతి): చేయూత పథకం కింద కొత్తగా పింఛన్‌ లబ్ధిదారులుగా ఎంపికైన వారికి రాష్ట్ర ప్రభుత్వం దీపావళి కానుకగా వాటిని అందించనుంది. అర్హులైన మరో 4.5 లక్షల మందికి పింఛన్లు అందజేయనుంది. ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి తన సొంత నియోజకవర్గమైన కొడంగల్‌లో నూతన పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి ధనసరి అనసూయ సీతక్క పాల్గొననున్నారు.


వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, నేత కార్మికులు, గీత కార్మికులు తదితర వర్గాల్లోని అరు?లైన వారికి కొత్తగా పింఛన్లు అందించనున్నారు. కొడంగల్‌లో కొంతమంది నూతన లబ్ధిదారులకు ముఖ్యమంత్రి చేతులమీదుగా పింఛన్‌ మంజూరు పత్రాలను అందజేస్తారు. అనంతరం రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారుల చేతుల మీదుగా లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందించనున్నారు. కొత్తగా పింఛన్లు మంజూరైన వారందరికీ ఈ నెల నుంచే పింఛన్‌ మొత్తాన్ని అందజేయనున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

సంక్రాంతి తర్వాత ప్రజాబలం

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ పథకాల ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్

తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రమంత్రి ప్రశంసలు.. మంత్రి సీతక్కకు శివరాజ్ సింగ్ చౌహాన్ లేఖ

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 08 , 2026 | 03:09 AM