మెడికల్ పీజీ మేనేజ్‌మెంట్ కోటా మెరిట్ లిస్ట్
ABN , Publish Date - Nov 16 , 2026 | 06:32 AM
మెడికల్ పీజీ డిగ్రీ, డిప్లొమా కోర్సుల మేనేజ్‌మెంట్ కోటా ప్రవేశాల ప్రొవిజనల్ మెరిట్ జాబితాను కాళోజీ హెల్త్ యూనివర్సిటీ విడుదల చేసింది.
1,611 మందితో కాళోజీ హెల్త్ యూనివర్సిటీ జాబితా
హైదరాబాద్, నవంబరు 15(ఆంధ్రజ్యోతి): మెడికల్ పీజీ డిగ్రీ, డిప్లొమా కోర్సుల మేనేజ్‌మెంట్ కోటా ప్రవేశాల ప్రొవిజనల్ మెరిట్ జాబితాను కాళోజీ హెల్త్ యూనివర్సిటీ విడుదల చేసింది. మేనేజ్‌మెంట్ కోటాకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల్లో అర్హులైన 1,611 మందితో ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్‌ను, నాట్ ఎలిజిబుల్ జాబితాను వేర్వేరుగా ప్రకటించింది.
వీటితో పాటు కాంపిటెంట్ అథారిటీ కోటా మెరిట్ జాబితాకు అనుబంధంగా మరో ఆరుగురితో కూడిన జాబితాను కూడా విడుదల చేసింది. ఏవైనా అభ్యంతరాలుంటే వెంటనే వర్శిటీ మెయిల్‌కు పంపాలని కోరింది. అభ్యంతరాలన్నింటినీ పరిశీలించి, పరిష్కరించిన అనంతరం ఫైనల్ మెరిట్ జాబితాను నోటిఫై చేస్తామని వెల్లడించింది. కాంపిటెంట్ అథారిటీ కోటా కింద 2026-27 మెడికల్ పీజీ డిగ్రీ, డిప్లొమా ప్రవేశాలకు సంబంధించి మెరిట్ లిస్ట్ అనుబంధ జాబితాను వర్శిటీ ప్రకటించింది.
ఈ వార్తలు కూడా చదవండి..
సాగునీటి ప్రాజెక్టులకు చేయూతనివ్వండి
Read Latest Telangana News And AP News And National News
And Telugu News