రోడ్ల అభివృద్ధికి ఆధునిక సాంకేతికత
ABN , Publish Date - Nov 23 , 2026 | 04:56 AM
భారతీయ రహదారుల కాంగ్రెస్(ఐఆర్సీ) 85వ వార్షిక సమావేశాలు విజయవంతం కావడం సంతోషంగా ఉందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు.
ఐఆర్సీ సదస్సుకు సహకరించిన
సీఎం, కేంద్ర మంత్రికి ధన్యవాదాలు: మంత్రి కోమటిరెడ్డి
హైదరాబాద్, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): భారతీయ రహదారుల కాంగ్రెస్ (ఐఆర్సీ) 85వ వార్షిక సమావేశాలు విజయవంతం కావడం సంతోషంగా ఉందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. ఈ సదస్సులో జరిగిన చర్చలు, నిపుణుల సూచనలు తెలంగాణ రహదారుల అభివృద్థికి ఎంతగానో దోహదపడతాయని ఆదివారం ఓ ప్రకటనలో ఆయన పేర్కొన్నారు. రహదారుల నిర్మాణంలో ఆధునిక సాంకేతికతలను అందిపుచ్చుకునేందుకు ఈ సదస్సు ఇంజనీర్లకు మంచి అవకాశాన్ని కల్పించిందన్నారు.
త్వరలో జరగనున్న తెలంగాణ గ్లోబల్ సమిట్‌కు ఐఆర్సీ సమావేశాలు సన్నాహక కార్యక్రమంగా నిలిచాయని వివరించారు. సదస్సు నిర్వహణకు సహకరించిన కేంద్ర మంత్రి గడ్కరీ, సీఎం రేవంత్ రెడ్డి తదితరులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. హైదరాబాద్‌లో నాలుగు రోజులపాటు నిర్వహించిన భారతీయ రహదారుల కాంగ్రెస్ (ఐఆర్సీ) 85వ వార్షిక సమావేశాలు ఆదివారం ముగిశాయి. దేశంలోని వివిధ రాష్ట్రాలతోపాటు విదేశాల నుంచి 3,000 మందికి పైగా ప్రతినిధులు హాజరయ్యారని నిర్వాహకులు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి...
కాంగ్రెస్, బీఆర్ఎస్ చిల్లర రాజకీయాలు మానుకోవాలి.. ఎంపీ అరవింద్ ధ్వజం
ఆన్లైన్ గేమింగ్ నెట్‌వర్క్‌పై డీజీజీఐ మెరుపు దాడులు
స్నేహ గ్రూప్‌పై ఐటీ శాఖ మెరుపు దాడులు.... 16 ప్రాంతాల్లో సోదాలు
Read Latest Telangana News And AP News And National News
And Telugu News