Share News

కొత్తగా 367 మెడికల్‌ పీజీ సీట్లు మంజూరు

ABN , Publish Date - Nov 07 , 2026 | 05:54 AM

రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లో పోస్టు గ్రాడ్యుయేట్‌ (పీజీ) సీట్ల సంఖ్య పెరిగింది. ఈ విద్యా సంవత్సరం నుంచే ఇవి అందుబాటులోకి రానున్నాయి.

కొత్తగా 367 మెడికల్‌ పీజీ సీట్లు మంజూరు
PG Medical Admissions

  • ప్రైవేటులో మరో 350...

  • ఈ ఏడాది అదనంగా 717 సీట్లు పెరుగుదల

  • 4,310కి చేరిన మొత్తం పీజీ సీట్ల సంఖ్య

హైదరాబాద్‌, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లో పోస్టు గ్రాడ్యుయేట్‌ (పీజీ) సీట్ల సంఖ్య పెరిగింది. ఈ విద్యా సంవత్సరం నుంచే ఇవి అందుబాటులోకి రానున్నాయి. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 359సీట్లు, నిమ్స్‌లో 8 సీట్లు కొత్తగా పెరిగాయి. ఈ మేరకు జాతీయ వైద్య కమిషన్‌(ఎన్‌ఎంసీ) శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం అందించింది. దీంతో ఒక్క ప్రభుత్వ వైద్య కళాశాలల్లోనే పీజీ సీట్ల సంఖ్య 1,731కు పెరిగింది. ఈ ఏడాది 26 మెడికల్‌ కాలేజీల్లో కొత్తగా 420 పీజీ సీట్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎన్‌ఎంసీకి దరఖాస్తు చేయగా 359 సీట్లు మంజూరు చేసింది.


రాష్ట్ర ప్రభుత్వం మౌలిక సదుపాయాల కల్పనపై అఫిడవిట్‌ సమర్పిస్తే... మిగిలిన 61 సీట్లు కూడా మంజూరయ్యే అవకాశం ఉందని వైద్యవర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం కాళోజీ హెల్త్‌ వర్శిటీ పీజీ మెడికల్‌ ప్రవేశాల కౌన్సెలింగ్‌ ప్రక్రియను చేపట్టింది. అలాగే ప్రైవేటులో మరో 350 సీట్లు పెరిగినట్లు వైద్యవర్గాలు తెలిపాయి. దీంతో ప్రైవేటులో మొత్తం సీట్ల సంఖ్య 2,229కి చేరింది. అలాగే డీమ్డ్‌ వర్శిటీలో కూడా ఇప్పటికే ఉన్న 300 పీజీ సీట్లు కాకుండా మరో 50 పీజీ సీట్లు పెరిగినట్లు ఆ వర్గాలు పేర్కొన్నాయి. వెరసి రాష్ట్రంలో మొత్తం పీజీ సీట్ల సంఖ్య 4,310కి పెరిగినట్లు వెల్లడించాయి.


ఈ వార్తలు కూడా చదవండి..

కాళేశ్వరంపై అసెంబ్లీ!

మరో రెండు పథకాలు

కొడంగల్‌లో రేపటి నుంచి సీఎం పర్యటన

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Nov 07 , 2026 | 05:54 AM