Share News

సమగ్ర భూ రీసర్వేను నిరంతరం పర్యవేక్షించాలి

ABN , Publish Date - Nov 12 , 2026 | 04:49 AM

సమగ్ర భూ రీసర్వేను జిల్లా కలెక్టర్లు నిరంతరం పర్యవేక్షించాలని, క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ రైతులకు అవగాహన కల్పించాలని రెవెన్యూ, హౌసింగ్‌, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సూచించారు.

సమగ్ర భూ రీసర్వేను నిరంతరం పర్యవేక్షించాలి
Ponguleti Srinivas Reddy

  • కలెక్టర్లకు సూచించిన మంత్రి పొంగులేటి

హైదరాబాద్‌, నవంబరు11(ఆంధ్రజ్యోతి): సమగ్ర భూ రీసర్వేను జిల్లా కలెక్టర్లు నిరంతరం పర్యవేక్షించాలని, క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ రైతులకు అవగాహన కల్పించాలని రెవెన్యూ, హౌసింగ్‌, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సూచించారు. రీసర్వే పూర్తయిన తర్వాత ఏవైనా అభ్యంతరాలు ఉంటే వాటిని తెలియజేసేందుకు కల్పిస్తున్న అవకాశాలను రైతులకు వివరించాలన్నారు. నోటీసులు జారీ చేసిన అనంతరం ప్రతి 15 రోజులకు ఒకసారి సంబంధిత గ్రామాల్లో చాటింపు నిర్వహించాలని, కలెక్టర్లు తప్పనిసరిగా ఆయా గ్రామాల్లో పర్యటించి రైతుల సందేహాలను నివృత్తి చేయాలని స్పష్టం చేశారు.


పాలేరు నియోజకవర్గాన్ని పైలట్‌ ప్రాజెక్టుగా తీసుకొని, నియోజకవర్గ పరిధిలోని మొత్తం 141 రెవెన్యూ గ్రామాల్లో రీసర్వే నిర్వహిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. రీసర్వే నిర్వహణకు ప్రభుత్వం ఇప్పటికే స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసీజర్‌(ఎ్‌సఓపీ) జారీ చేసిందని మంత్రి పొంగులేటి తెలిపారు. క్షేత్రస్థాయి అధికారుల సూచనలతో ఎస్‌ఓపీలో అవసరమైన మార్పులు చేస్తామని చేసి మరింత స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేస్తామన్నారు. రెవెన్యూ, ఫారెస్ట్‌ భూముల సరిహద్దుల విషయంలో గందరగోళానికి తావులేకుండా అధికారులతో సమన్వయం చేసుకోవాలని కలెక్టర్లకు సూచించారు. 22-ఎ భూములకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి.

ఆంధ్రకు నీళ్లు.. తెలంగాణకు ఎక్కిళ్లు

ప్రజాస్వామ్య పరిరక్షణకే భారత్‌ సమ్మిట్‌ 2.0

వరి పంట తప్ప..!

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 12 , 2026 | 04:49 AM