Share News

వెయ్యి గ్రామాలు దాటిన భూ రీసర్వే

ABN , Publish Date - Nov 11 , 2026 | 06:22 AM

రాష్ట్రంలో సమగ్ర భూ రీసర్వే వెయ్యి గ్రామాల మైలురాయి దాటిందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇప్పటివరకు 416 గ్రామాల్లో సర్వే ప్రక్రియ పూర్తయిందన్నారు.

వెయ్యి గ్రామాలు దాటిన భూ రీసర్వే
Ponguleti Srinivas Reddy

  • 416 గ్రామాల్లో సర్వే ప్రక్రియ పూర్తి

  • రెవెన్యూ రికార్డుల ఆధారంగానే సర్వే నిర్వహణ

  • రీసర్వే పురోగతిపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

  • నేడు జిల్లా కలెక్టర్లు, ఆర్డీవోలతో సమీక్ష

హైదరాబాద్‌, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో సమగ్ర భూ రీసర్వే వెయ్యి గ్రామాల మైలురాయి దాటిందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇప్పటివరకు 416 గ్రామాల్లో సర్వే ప్రక్రియ పూర్తయిందన్నారు. తరతరాలుగా కొనసాగుతున్న భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపడంతో పాటు యజమానులకు స్పష్టమైన హక్కులు, కచ్చితమైన సరిహద్దులు కల్పించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు. మంగళవారం సచివాలయంలో రీసర్వే పురోగతిపై అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు.


రాష్ట్రవ్యాప్తంగా 10,954 రెవెన్యూ గ్రామాలు ఉండగా, తొలి దశలో హైదరాబాద్‌ మినహా మిగిలిన 32 జిల్లాల్లో 2,720 గ్రామాలను రీసర్వేకు ఎంపిక చేసినట్లు తెలిపారు. సర్వేకు ముందు రెవెన్యూ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి, వాటి ఆధారంగానే ప్రక్రియ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. భూ యజమానుల అభిప్రాయాలకు ప్రాధాన్యమిస్తూ పారదర్శకంగా సర్వే నిర్వహించాలని సూచించారు. రీసర్వే పూర్తయిన గ్రామాల్లో ప్రతి భూమికి ప్రత్యేక గుర్తింపు సంఖ్యగా భూదార్‌ నంబర్‌ కేటాయింపును వేగవంతం చేయాలన్నారు. రీసర్వే పురోగతి, క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలపై బుధవారం జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఆర్డీవోలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించనున్నట్లు మంత్రి వెల్లడించారు.


ఈ వార్తలు కూడా చదవండి.

విద్యాసంస్థల్లో సినిమా కార్యక్రమాలు నిషేధం!

రొమ్ము నుంచి ఇతర అవయవాలకు క్యాన్సర్‌!

ఆరోపణలపై నిష్పాక్షిక విచారణ జరిపించాలి

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 11 , 2026 | 06:22 AM