ఖరీఫ్‌లో తగ్గిన ఎరువుల అమ్మకాలు
ABN , Publish Date - Nov 24 , 2026 | 04:10 AM
ఈ ఏడాది ఖరీఫ్ సీజన్(ఏప్రిల్-అక్టోబరు)లో రాష్ట్రవ్యాప్తంగా ఎరువుల విక్రయాలు తగ్గుముఖం పట్టాయి.
యూరియా అమ్మకాల్లో 35 వేల టన్నుల తగ్గుదల
కాంప్లెక్స్ ఎరువులైతే ఏకంగా 1.88లక్షల టన్నులు
హైదరాబాద్, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): ఈ ఏడాది ఖరీఫ్ సీజన్(ఏప్రిల్-అక్టోబరు)లో రాష్ట్రవ్యాప్తంగా ఎరువుల విక్రయాలు తగ్గుముఖం పట్టాయి. గతేడాది ఖరీఫ్‌లో రైతులు 9.79లక్షల టన్నుల యూరియాను కొనుగోలు చేయగా ఈ ఏడాది 9.44లక్షల టన్నులే కొన్నారు. అంటే రైతులు 35వేల టన్నులు తక్కువగా కొనుగోలు చేశారు. కాంప్లెక్స్ ఎరువులు(ఎన్‌పీ, ఎన్‌పీకే) గడిచిన ఖరీఫ్‌లో 8.97లక్షల టన్నులు అమ్ముడవగా... ఈసారి 7.09 లక్షల టన్నులకు పడిపోయాయి. ఏకంగా 1.88 లక్షల టన్నులు తగ్గిపోయాయి. అయితే, డీఏపీ విక్రయాలు 2.38 లక్షల టన్నుల నుంచి 2.98 లక్షల టన్నులకు పెరిగాయి. అంటే 60వేల టన్నుల పెరుగుదల అన్నమాట. ఎంవోపీ 43 వేల టన్నుల నుంచి 49 వేల టన్నులకు, ఎస్‌ఎస్‌పీ 34 వేల టన్నుల నుంచి 48 వేల టన్నులకు పెరిగాయి. ఈ ఖరీఫ్‌లో ప్రధాన ఎరువుల వినియోగంపై రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు నివేదిక విడుదల చేసింది.
మొత్తంగా గతేడాది ఖరీఫ్ కన్నా ఈ ఏడాది 1.43లక్షల టన్నుల ఎరువులు తక్కువగా అమ్ముడుపోయాయి. పంటల ప్రారంభ దశ నుంచి ఎదుగుదల వరకు అవసరమైన పోషకాలు అందించే కాంప్లెక్స్ ఎరువుల విక్రయాల్లో తేడాలు గణనీయంగా ఉండటం దిగుబడులపై చాలా ప్రభావం చూపించే అవకాశం ఉందని వ్యవసాయరంగ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దేశవ్యాప్తంగా చూసినా కూడా ఈ ఖరీఫ్‌లో ఎరువుల విక్రయాలు 8 శాతం తగ్గిపోయాయి. కాంప్లెక్స్ ఎరువుల(ఎన్‌పీ/ఎన్‌పీకే) అమ్మకాలు ఏకంగా 25.5 శాతం పడిపోయాయి. యూరియా అమ్మకాలు 3.7 శాతం తగ్గిపోయాయి. దేశమంతటా ఉన్న ఎల్‌నినో పరిస్థితులు, ఫలితంగా సాగు విస్తీర్ణంతగ్గడం, వేసిన పంటలు ఎండిపోతుండటం వల్లే ఎరువుల వినియోగం తగ్గినట్లు అంచనా వేస్తున్నారు. ఖరీఫ్ లో కష్టమ్మీద పంటలు గట్టెక్కినా..యాసంగిలో మరింత ఇబ్బందికర పరిస్థితి ఏర్పడనుంది.
ఈ వార్తలు కూడా చదవండి...
పార్టీకి నష్టం చేసేలా మాట్లాడితే చర్యలు.. సీఎం రేవంత్‌రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్
హైదరాబాద్‌లో ఉగ్రదాడుల హెచ్చరిక.. పోలీసుల హై అలర్ట్!
తెలంగాణలో ష్నైడర్ సంస్థ విస్తరణకు పూర్తి సహకారం అందిస్తాం: భట్టి విక్రమార్క
Read Latest Telangana News And AP News And National News
And Telugu News