Share News

‘ఇన్వెస్ట్‌ గ్లోబల్‌ సమ్మిట్‌’పై యూరప్‌లో రోడ్డు షోలు

ABN , Publish Date - Nov 17 , 2026 | 04:27 AM

తెలంగాణకు పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్‌ 7 నుంచి ‘ఇన్వెస్ట్‌ తెలంగాణ గ్లోబల్‌ సమ్మిట్‌-2026’ పేరుతో ప్రతిష్ఠాత్మక సదస్సు నిర్వహించనుంది.

‘ఇన్వెస్ట్‌ గ్లోబల్‌ సమ్మిట్‌’పై యూరప్‌లో రోడ్డు షోలు
Telangana Government

తెలంగాణకు పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్‌ 7 నుంచి ‘ఇన్వెస్ట్‌ తెలంగాణ గ్లోబల్‌ సమ్మిట్‌-2026’ పేరుతో ప్రతిష్ఠాత్మక సదస్సు నిర్వహించనుంది. ఈ సదస్సు గురించి తెలియజేస్తూ ఢిల్లీలో ఇప్పటికే రోడ్‌ షోలు నిర్వహించింది. ఇదే తరహాలో ఈ నెల 18 (బుధవారం) నుంచి 21వరకు జర్మనీ, ప్రాన్స్‌లోనూ రోడ్‌ షోలు చేపట్టేందుకు సిద్ధమైంది. యూర్‌పకు చెందిన పారిశామ్రికవేత్తలు, పెట్టుబడిదారులకు.. తెలంగాణలో ఉన్న అవకాశాలను వివరించనున్నారు.


మరోవైపు 20న స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో జరిగే ఐక్యరాజ్య సమితి ‘ఇంపాక్ట్‌ సమ్మిట్‌’లో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు ప్రసంగించనున్నారు. అనంతరం పెట్టుబడిదారులు, పారిశ్రామిక రంగ ప్రముఖులతో సమావేశం కానున్నారు. యూరప్‌ దేశాల్లో రోడ్‌ షోలు, ఐటీ మంత్రి వెంట వెళ్లేందుకు వీలుగా.. పీఎస్‌ వెంకటశేఖర్‌, ఐటీ శాఖ కన్సల్టెంట్‌ కే.సుహాస్‌రెడ్డి, లైఫ్‌ సైన్సెస్‌ డైరక్టర్‌ సర్వేశ్‌కుమార్‌సింగ్‌లకు ప్రభుత్వం అనుమతిచ్చింది.


ఈ వార్తలు కూడా చదవండి..

ప్రధాని మోదీతో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ

కాళేశ్వరం ప్రాజెక్టులో గేట్లు మూసి నీటిని నిల్వ చేసే అవకాశం లేదు: మంత్రి తుమ్మల

సజ్జనార్ ఆస్తుల కొనుగోళ్లపై విచారణ జరిపించాలి: రాజాసింగ్

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 17 , 2026 | 04:27 AM