తెలంగాణను స్పోర్ట్స్ హబ్‌గా తీర్చిదిద్దుతాం: దుద్దిళ్ల
ABN , Publish Date - Nov 06 , 2026 | 05:19 AM
రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోందని రాష్ట్ర మంత్రి, బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ(బీఏటీ) అధ్యక్షుడు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు.
రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోందని రాష్ట్ర మంత్రి, బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ(బీఏటీ) అధ్యక్షుడు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు. తెలంగాణను అంతర్జాతీయ స్థాయి స్పోర్ట్స్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. గచ్చిబౌలిలోని పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీలో ఈ నెల 3 నుంచి 8 వరకు బీఏటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘తెలంగాణ ఇండియా ఇంటర్నేషనల్ ఛాలెంజ్-2026’ టోర్నమెంట్‌లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ క్రికెటర్ చాముండేశ్వరనాథ్, పుల్లెల గోపీచంద్‌తో కలిసి వెబ్‌ల్యాబ్స్ అభివృద్ధి చేసిన స్పోర్ట్స్ డిజిటల్ ప్లాట్ ఫామ్‌ను శ్రీధర్‌బాబు ఆవిష్కరించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తెలంగాణ బ్రాండ్ ప్రపంచానికి చాటాలి
కొడంగల్‌లో రేపటి నుంచి సీఎం పర్యటన
Read Latest AP News And Telangana News And National News
And Telugu News