Share News

ఫిబ్రవరి 24 నుంచి ఇంటర్‌ పరీక్షలు

ABN , Publish Date - Nov 20 , 2026 | 04:24 AM

ఇంటర్మీడియట్‌ పరీక్షల షెడ్యూల్‌ గురువారం విడుదలైంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలల్లో నిర్వహించే ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షల తేదీలను ఇంటర్మీడియట్‌ బోర్డు ప్రకటించింది.

ఫిబ్రవరి 24 నుంచి ఇంటర్‌ పరీక్షలు
Telangana Inter Exams 2027

  • జనవరి చివర్లో ప్రాక్టికల్స్‌

  • షెడ్యూల్‌ విడుదల చేసిన ఇంటర్‌ బోర్డు

హైదరాబాద్‌, నవంబరు 19(ఆంధ్రజ్యోతి): ఇంటర్మీడియట్‌ పరీక్షల షెడ్యూల్‌ గురువారం విడుదలైంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలల్లో నిర్వహించే ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షల తేదీలను ఇంటర్మీడియట్‌ బోర్డు ప్రకటించింది. ఫస్టియర్‌ పరీక్షలు ఫిబ్రవరి 24న ప్రారంభమై మార్చి 19న, సెకండియర్‌ పరీక్షలు ఫిబ్రవరి 25న ప్రారంభమై మార్చి 20న ముగియనున్నాయి. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. లాంగ్వేజ్‌ పరీక్షలు మినహా మిగతావాటి మధ్య ఈసారి 2-5రోజుల విరామం ఇచ్చారు. ఇవే తేదీలు ఒకేషనల్‌ కోర్సులకు వర్తిస్తాయని, ఆ షెడ్యూల్‌ను ప్రత్యేకంగా విడుదల చేయనున్నట్లు బోర్డు తెలిపింది.


ఫస్టియర్‌ షెడ్యూల్‌

ఫిబ్రవరి 24న ద్వితీయ భాష పేపర్‌-1, 26న ఇంగ్లిష్‌ పేపర్‌-1, మార్చి 2, 5 తేదీల్లో వివిధ గ్రూపులకు సంబంధించిన గణితం, బోటనీ, జువాలజీ, పొలిటికల్‌ సైన్స్‌, హిస్టరీ, కామర్స్ల్‌. మార్చి 9న ఫిజిక్స్‌, ఎకనామిక్స్‌, మార్చి 15న కెమిస్ట్రీ, కామర్స్‌, అకౌంటెన్సీ, మార్చి 17న పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌, మ్యాథమెటిక్స్‌(ఎంఈసీ), మార్చి 19న మోడరన్‌ లాంగ్వేజ్‌, జాగ్రఫీ, బ్రిడ్జి కోర్సు మ్యాథమెటిక్స్‌.


సెకండియర్‌ షెడ్యూల్‌

ఫిబ్రవరి 25న ద్వితీయ భాష పేపర్‌-2. 27న ఇంగ్లిష్‌ పేపర్‌-2, మార్చి 3, 8 తేదీల్లో గణితం, బోటనీ, జువాలజీ, పొలిటికల్‌ సైన్స్‌, హిస్టరీ. మార్చి 12న ఫిజిక్స్‌, ఎకనామిక్స్‌, మార్చి 16న కెమిస్ట్రీ, కామర్స్‌, అకౌంటెన్సీ, మార్చి 18న పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌, మార్చి 20న మోడరన్‌ లాంగ్వేజ్‌, జాగ్రఫీ, బ్రిడ్జి కోర్సు మ్యాథమెటిక్స్‌.


ప్రాక్టికల్స్‌ తేదీలు

  • సెకండియర్‌ సైన్స్‌ విద్యార్థులకు ఫిబ్రవరి 1 నుంచి 10వరకు ప్రాక్టికల్‌ పరీక్షలు ఉంటా యి. ఆదివారాలుసహా రెండు సెషన్లలో నిర్వహిస్తారు. ఉదయం 9నుంచి మధ్యాహ్నం 12వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయం త్రం 5 వరకు పరీక్షలు జరుగుతాయి.

  • ఫస్టియర్‌ సైన్స్‌ విద్యార్థులకు ఫిబ్రవరి 11 నుంచి 18 వరకు మూడు సెషన్లలో ప్రాక్టికల్స్‌ నిర్వహిస్తారు. మొదటి సెషన్‌ ఉదయం 9 నుంచి 11 వరకు, రెండో సెషన్‌ మధ్యాహ్నం 12 నుంచి 2 వరకు, మూడో సెషన్‌ మధ్యాహ్నం3.30నుంచి సాయంత్రం 5.30 వరకు ఉంటుంది.

  • ఫస్టియర్‌ విద్యార్థులకు జనవరి 29న, సెకండియర్‌ విద్యార్థులకు జనవరి 30న ఇంగ్లిష్‌ ప్రాక్టికల్స్‌ నిర్వహించనున్నారు. జనవరి 29న ఎథిక్స్‌ అండ్‌ హ్యూమన్‌ వాల్యూస్‌, జనవరి 27న ఎన్విరాన్‌మెంటల్‌ ఎడ్యుకేషన్‌ పరీక్ష ఉదయం 10 నుంచి 1 వరకు నిర్వహిస్తారు. ప్రథమ సంవత్సరం ఇంటర్నల్‌ అసె స్‌మెంట్‌ జనవరి 20-25 వరకు జరగనుంది.


ఈ వార్తలు కూడా చదవండి...

తెలంగాణ ఓటర్ల జాబితాపై ఈసీ కీలక నిర్ణయం

నీళ్ల విషయంలో తెలంగాణకు తీవ్ర అన్యాయం: కేటీఆర్

ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ కారుకు ప్రమాదం..

Read Latest Telangana News And AP NewsAnd National News

And Telugu News

Updated Date - Nov 20 , 2026 | 04:24 AM