Share News

‘మెట్రోపాలిటన్‌ ఏరియా’ శాఖ కార్యదర్శిగా సర్ఫ్‌రాజ్‌ అహ్మద్‌

ABN , Publish Date - Nov 29 , 2026 | 03:53 AM

రాష్ట్ర ప్రభుత్వం పలువురు ఐఏఎస్‌లు, నాన్‌-కేడర్‌ అధికారును బదిలీ చేస్తూ కీలక పోస్టుల్లో నియమించింది.

‘మెట్రోపాలిటన్‌ ఏరియా’ శాఖ కార్యదర్శిగా సర్ఫ్‌రాజ్‌ అహ్మద్‌

  • మూడు కార్పొరేషన్ల ప్రత్యేకాధికారిగా అదనపు బాధ్యతలు

  • హెచ్‌ఎండీఏ మెట్రోపాలిటన్‌ కమిషనర్‌గా ఈవీ నర్సింహారెడ్డి

  • రాష్ట్రంలో ఐఏఎస్‌, నాన్‌-కేడర్‌ అధికారుల బదిలీలు

హైదరాబాద్‌, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం పలువురు ఐఏఎస్‌లు, నాన్‌-కేడర్‌ అధికారును బదిలీ చేస్తూ కీలక పోస్టుల్లో నియమించింది. హెచ్‌ఎండీఏ మెట్రోపాలిటన్‌ కమిషనర్‌గా ఉన్న సర్ఫ్‌రాజ్‌ అహ్మద్‌ను మెట్రోపాలిటన్‌ ఏరియా, అర్బన్‌ డెవల్‌పమెంట్‌ శాఖ కార్యదర్శిగా నియమించింది. గ్రేటర్‌ హైదరాబాద్‌, సైబరాబాద్‌, మల్కాజిగిరి మునిసిపల్‌ కార్పొరేషన్ల ప్రత్యేకాధికారిగా అదనపు బాధ్యతలు అప్పగించింది. మూసీ రివర్‌ఫ్రంట్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ ఎండీగా ఉన్న ఈవీ నర్సింహారెడ్డిని హెచ్‌ఎండీఏ మెట్రోపాలిటన్‌ కమిషనర్‌గా నియమించింది. మూసీ రివర్‌ఫ్రంట్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ ఎండీగా అదనపు బాధ్యతలు అప్పగించింది. ఇన్వెస్ట్‌ తెలంగాణ సీఈవో బి.అజిత్‌రెడ్డికి హైదరాబాద్‌ మెట్రో రైలు లిమిటెడ్‌ ఎండీగా అదనపు బాధ్యతలు అప్పగించింది.


హైదరాబాద్‌ మెట్రో వాటర్‌ బోర్డు జాయింట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ మయాంక్‌ మిట్టల్‌కు జీహెచ్‌ఎంసీ శంషాబాద్‌ జోనల్‌ కమిషనర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించింది. ఇప్పటివరకు ఈ జోనల్‌ కమిషనర్‌గా ఉన్న కె.చంద్రకళను హెచ్‌ఎండీఏ జాయింట్‌ మెట్రోపాలిటన్‌ కమిషనర్‌గా బదిలీ చేసింది. హైదరాబాద్‌ గ్రోత్‌ కారిడార్‌ లిమిటెడ్‌ స్పెషల్‌ కలెక్టర్‌గా ఆమెకు అదనపు బాధ్యతలు అప్పగించింది. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి సబ్‌ కలెక్టర్‌ మనోజ్‌ను హైదరాబాద్‌ మెట్రో రైలు లిమిటెడ్‌ జాయింట్‌ ఎండీగా నియమించింది. వరంగల్‌లోని స్టేట్‌ ఆడిట్‌ విభాగం రీజినల్‌ డిప్యూటీ డైరెక్టర్‌, నాన్‌-కేడర్‌ అధికారి పి.రామును విద్యా శాఖ ప్రత్యేకాధికారి (ప్రాజెక్టులు)గా నియమించింది. ఇప్పటివరకు ఆ బాధ్యతలు నిర్వహిస్తున్న వి.శ్రీనివా్‌సరెడ్డిని మాతృ శాఖకు రిపోర్టు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌ జాజు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి...

మహిళా రిజర్వేషన్ల అమలుకు మోదీ సర్కార్ నయా ప్లాన్.. డీలిమిటేషన్ బిల్లులో కీలక మార్పులు

నిరుద్యోగులకు రేవంత్ సర్కార్ శుభవార్త.. విదేశీ ఉద్యోగాల కోసం కొత్త పథకానికి శ్రీకారం

పోలీస్ శాఖలో అవినీతికి పాల్పడితే ఎవరినీ ఉపేక్షించం: డీజీపీ ఆనంద్

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 29 , 2026 | 03:57 AM