Share News

వెల్ఫేర్‌ స్టాంప్‌.. టోల్‌ విధించడం వంటిది కాదు

ABN , Publish Date - Nov 11 , 2026 | 05:06 AM

ప్రతి వకాలత్‌పై వెల్ఫేర్‌ ఫండ్‌ స్టాంప్‌ అతికించాలనే నిబంధన సహేతుకమేనని హైకోర్టు పేర్కొంది.

వెల్ఫేర్‌ స్టాంప్‌.. టోల్‌ విధించడం వంటిది కాదు
Telangana High Court

  • అడ్వకేట్‌ వెల్ఫేర్‌ ఫండ్‌ చట్టం రాజ్యాంగ సమ్మతమే: హైకోర్టు

హైదరాబాద్‌, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి): ప్రతి వకాలత్‌పై వెల్ఫేర్‌ ఫండ్‌ స్టాంప్‌ అతికించాలనే నిబంధన సహేతుకమేనని హైకోర్టు పేర్కొంది. ప్రతి వకాలత్‌పై అడ్వకేట్‌ వెల్ఫేర్‌ ఫండ్‌ స్టాంప్‌ పెట్టడాన్ని తప్పనిసరి చేస్తున్న అడ్వకేట్‌ వెల్ఫేర్‌ ఫండ్‌ చట్టాన్ని సవాల్‌ చేస్తూ విజయ్‌గోపాల్‌ అనే న్యాయవాది హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.


ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ శాంకోషీ, జస్టిస్‌ నర్సింగ్‌రావు ధర్మాసనం.. స్టాంప్‌ కోసం పెట్టే డబ్బు చాలా తక్కువ అని.. ఆ డబ్బు పెట్టిన వారు ఆ తర్వాత దాన్ని మర్చిపోతారని.. అయితే ఆ నిధి కుటుంబ పెద్దను కోల్పోయిన ఒక వితంతువు, అనాథ బిడ్డ లేదా వృద్ధ తల్లిదండ్రులకు తక్షణ ఆర్థిక భరోసాను కల్పిస్తుందనే విషయాన్ని మర్చిపోకూడదని పేర్కొంది. అడ్వకేట్‌ వెల్ఫేర్‌ ఫండ్‌ చట్టం రాజ్యాంగ సమ్మతమేనని.. న్యాయవాద వృత్తిని కొనసాగించే హక్కుపై అసమంజసమైన పరిమితి లేదా టోల్‌ విధించడం లాంటిది కాదని ప్రకటించింది.


ఈ వార్తలు కూడా చదవండి.

విద్యాసంస్థల్లో సినిమా కార్యక్రమాలు నిషేధం!

రొమ్ము నుంచి ఇతర అవయవాలకు క్యాన్సర్‌!

ఆరోపణలపై నిష్పాక్షిక విచారణ జరిపించాలి

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 11 , 2026 | 05:06 AM