ప్రైవేట్ కాలేజీలకు తెలంగాణ హైకోర్టులో స్వల్ప ఊరట
ABN , Publish Date - Jun 25 , 2026 | 02:51 PM
తెలంగాణలోని ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలకు హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. ఫీజుల వసూలు, ఫీజు రియింబర్స్‌మెంట్‌కు సంబంధించి ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన జీవో నంబర్ 9లోని మార్గదర్శకాలపై హైకోర్టు మధ్యంతర స్టే విధించింది.
హైదరాబాద్, జూన్ 25: తెలంగాణ హైకోర్టులో ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలకు స్వల్ప ఊరట దక్కింది. విద్యార్ధుల నుంచి ఫీజులు వసూలు చేయవద్దని ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 9లోని కొన్ని మార్గదర్శకాలపై స్టే విధించింది. వచ్చే మంగళవారం వరకు స్టే విధిస్తూ హైకోర్టు మధ్యoతర ఉత్తర్వులు జారీ చేసింది.
విచారణ సందర్భంగా ప్రభుత్వానికి హైకోర్టు పలు ప్రశ్నలను సంధించింది. మీరు బకాయిలు చెల్లించరు, విద్యార్ధుల నుంచి కళాశాలలను ఫీజులు వసూలు చేయవద్దంటే వారు ఎలా నడుపుతారని కోర్టు ప్రశ్నించింది. అలానే ఫీజు రీయింబర్స్మెంట్ కోసం ఎంత బడ్జెట్ కేటాయించారని అడిగింది. బడ్జెట్ సెషన్ కూడా అయిపోయినట్టు ఉందని, ఇంకా బకాయిలు ఎందుకు రిలీజ్ చేయలేదని ప్రభుత్వాని హైకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. పెండింగ్ బకాయిలు ఎప్పటి లోగా చెల్లిస్తారో తెలపాలని పేర్కొంది. ఈ ఏడాది ఆగస్టు15 లోపు బకాయిలు అన్ని క్లియర్ అవుతాయన్న ప్రభుత్వ తరఫు న్యాయవాది హైకోర్టుకు తెలియజేశారు.
ఆగస్టు 15 లోపు బకాయిలు క్లియర్ అయితే ఆరోజే మా పిటిషన్లను వెనక్కి తీసుకుంటామని ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు కోర్టుకు తెలిపాయి. మరోవైపు విద్యార్థులు కూడా ఇంప్లీడ్ పిటిషన్లు దాఖలు చేశారు. ప్రభుత్వానికి, కాలేజ్ యాజమాన్యాలకు మధ్య విద్యార్థులు నలిగిపోతున్నారని వారి తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ బకాయిల ద్వారా 2,3,4 ఇయర్ స్టూడెంట్స్ నష్టపోకుండా చూడాలని ఆయన ధర్మాసనాన్ని కోరారు. ఈ ఏడాది కాలేజీల్లో చేరుతున్న విద్యార్థులకే ఇది వర్తించేలా చూడాలని వారి తరఫు న్యాయవాది కోర్టుకు విజ్ఞప్తి చేశారు. హైకోర్టు తదుపరి విచారణను మంగళవారానికి(జూన్ 30) వాయిదా వేసింది.
ఇవి కూడా చదవండి:
తుంగభద్ర గేట్ల పునరుద్ధరణ చరిత్రలో నిలిచిపోతుంది: సీఎం రేవంత్ రెడ్డి
అక్కసుతోనే అడ్డగోలు మాటలు.. కేటీఆర్, హరీశ్‌పై మహేష్ ఆగ్రహం