Share News

తుంగభద్ర డ్యాం కొత్త స్పీల్ వే గేట్ల ప్రారంభం..

ABN , Publish Date - Jun 25 , 2026 | 01:59 PM

తుంగభద్ర డ్యాం కొత్త స్పీల్ వే గేట్లను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈరోజు(గురువారం) మధ్యాహ్నం ప్రారంభించారు. రూ.51కోట్లతో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన 33 కొత్త స్పీల్ వే గేట్లను ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి, శివకుమార్ ప్రారంభించారు.

తుంగభద్ర డ్యాం కొత్త స్పీల్ వే గేట్ల ప్రారంభం..

కర్ణాటక: తుంగభద్ర డ్యాం కొత్త స్పీల్ వే గేట్లను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈరోజు(గురువారం) మధ్యాహ్నం ప్రారంభించారు. రూ.51కోట్లతో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన 33 కొత్త స్పీల్ వే గేట్లను ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి, శివకుమార్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర జలశక్తి శాఖా మంత్రి సీఆర్ పాటిల్‌తో పాటు ఆయా రాష్ట్రాల మంత్రులు, అధికారులు, పార్టీల కార్యకర్తలు హాజరయ్యారు.


గేట్ల ప్రారంభోత్సవం అనంతరం విజయనగర జిల్లా హోసపేటలో జరిగే భారీ బహిరంగ సభకు కేంద్ర మంత్రి, ముఖ్యమంత్రులు వెళ్లారు. సభలో మూడు రాష్ట్రాల సీఎంలు, కేంద్ర మంత్రి ప్రసంగించారు. అంతకుముందు మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కొప్పల్ జిల్లా మునీరాబాద్‌లోని ఆడిటోరియంలో భేటీ అయ్యారు. అంతర్రాష్ట్ర జల వివాదాలకు సంబంధించిన కీలక అంశాలపై చర్చించారు. తొలుత చంద్రబాబు, డీకే శివకుమార్ భేటీ అవ్వగా.. సమావేశానికి రేవంత్ రెడ్డి 15 నిమిషాలు ఆలస్యంగా వెళ్లారు. అనంతరం ముగ్గురు సీఎంలు, కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ నీటి సమస్యలపై కీలక చర్చలు జరిపారు. ఆ తర్వాత అక్కడి నుంచి గేట్ల ప్రారంభోత్సవానికి వెళ్లారు.


ఈ వార్తలు కూడా చదవండి

నిజంగానే మనం కలిసి ఉన్నామా?.. ఎంవీఏ నేతలను ప్రశ్నించిన ఉద్ధవ్ ఠాక్రే..

గ్రామస్తులను టెన్షన్ పెట్టిన మందు బాబు.. చివరకు ఏమైందంటే..

Updated Date - Jun 25 , 2026 | 02:47 PM