అక్కసుతోనే అడ్డగోలు మాటలు.. కేటీఆర్, హరీశ్‌పై మహేష్ ఆగ్రహం
ABN , Publish Date - Jun 25 , 2026 | 01:46 PM
తెలంగాణ కాంగ్రెస్ గిరిజన నేతలు చేపట్టిన ఇందిరమ్మ ఆశీర్వాద బస్సు యాత్రను టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ప్రారంభించారు. కేటీఆర్, హరీశ్‌రావు శకం గతమని.. అధికారం పోయిందన్న అక్కసుతో వారిద్దరూ అడ్డగోలుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
హైదరాబాద్, జూన్ 25: తెలంగాణ కాంగ్రెస్ గిరిజన నేతలు చేపట్టిన ఇందిరమ్మ ఆశీర్వాద బస్సు యాత్రను టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేటీఆర్, హరీశ్‌రావు శకం గతమని.. అధికారం పోయిందన్న అక్కసుతో వారిద్దరూ అడ్డగోలుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఇందిరాగాంధీ.. ఎస్టీ రిజర్వేషన్ ఇవ్వకపోయి ఉంటే నేడు లంబాడీలు, ఎరుకల, యానాదిలు ఈ స్థాయిలో ఉండేవాళ్లు కాదన్నారు. లంబాడీల బాగు కోసం పనిచేసే ప్రభుత్వం తమది అని స్పష్టం చేశారు. ఇందిరాగాంధీ గుడిసెలు లేని గ్రామాలు కావాలని అనుకున్నారని.. ఆ దిశగానే తాము ముందుకు వెళ్తున్నామని చెప్పారు.
కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి.. బావాబామ్మర్దులకు నచ్చడం లేదని మహేష్ విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో 100 సీట్లు తగ్గకుండా మళ్లీ అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. 1 లక్ష 78 వేల కోట్ల రూపాయల విదేశీ పెట్టుబడులు తీసుకొచ్చామని తెలిపారు. ఫ్యూచర్ సిటీని మొదలు పెట్టి 5 లక్షల 78 వేల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చామని చెప్పారు. బస్సు యాత్ర ముగింపు కార్యక్రమానికి ప్రియాంక గాంధీని తీసుకువచ్చే ప్రయత్నం చేస్తామని మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ లంబాడ ఎమ్మెల్యేలు, ఎంపీలు హాజరయ్యారు.
ఇవి కూడా చదవండి...
ఈనెల 28న నల్లగొండకు సీఎం రేవంత్.. అభివృద్ధి పనులకు శంకుస్థాపన
SIRను సీరియస్‌గా తీసుకోవాలి: ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి
Read Latest Telangana News And Telugu News