Share News

ఈనెల 28న నల్లగొండకు సీఎం రేవంత్.. అభివృద్ధి పనులకు శంకుస్థాపన

ABN , Publish Date - Jun 25 , 2026 | 11:07 AM

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈనెల 28న నల్లగొండ జిల్లాలో పర్యటించనున్నారు. రూ.13వేల కోట్ల వ్యయంతో నిర్మించే R&B హ్యామ్ రోడ్ల పనులకు సీఎం శంకుస్థాపన చేస్తారు.

ఈనెల 28న నల్లగొండకు సీఎం రేవంత్.. అభివృద్ధి పనులకు శంకుస్థాపన
CM Revanth Reddy

హైదరాబాద్, జూన్ 25: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈనెల 28న నల్లగొండ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. రూ.13వేల కోట్ల వ్యయంతో నిర్మించే R&B హ్యామ్ రోడ్ల పనులకు సీఎం శంకుస్థాపన చేస్తారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పర్యవేక్షించారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి నల్లగొండ జిల్లా కనగల్ మండలం చేరుకోనున్న రేవంత్... మొదటగా మధ్యాహ్నం 3:30 గంటల ప్రాంతంలో ఏఎంసీ మార్కెట్‌యార్డు వద్ద నిర్మించిన ‘హ్యామ్’ రోడ్ల పైలాన్‌ను ఆవిష్కరించనున్నారు.


నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్‌లో మొదటి ఫేజ్ డ్రింకింగ్ వాటర్ అందించే పనులకు సీఎం శంకుస్థాపన చేస్తారు. ఎన్జీ కాలేజీ గ్రౌండ్స్‌లో జరిగే భారీ బహిరంగ సభకు హాజరుకానున్నారు. ప్రసంగం అనంతరం SHG మహిళా సంఘాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెక్కులను అందజేయనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తోంది.


ఇవి కూడా చదవండి...

ఏపీలో పెద్ద సినిమాకు క్లాప్ కొట్టి 20 ఏళ్లు అయింది: బాలకృష్ణ

రైళ్లపై రాళ్లేస్తే పట్టేస్తాయి!

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jun 25 , 2026 | 12:52 PM