Share News

SIR‌ను సీరియస్‌గా తీసుకోవాలి: ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి

ABN , Publish Date - Jun 25 , 2026 | 01:15 PM

SIRపై అప్రమత్తంగా ఉండాలని కాంగ్రెస్ నేతలకు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణలో 36 వేలకు పైగా పోలింగ్ బూత్‌లలో ఎస్‌ఐఆర్ ప్రక్రియ కొనసాగుతోందన్నారు.

SIR‌ను సీరియస్‌గా తీసుకోవాలి: ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి
Chamala Kiran Kumar Reddy

హైదరాబాద్, జూన్ 25: SIRపై అప్రమత్తంగా ఉండాలని కాంగ్రెస్ నేతలకు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈరోజు(గురువారం) మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా 36 వేలకు పైగా పోలింగ్ బూత్‌లలో ఎస్‌ఐఆర్ ప్రక్రియ కొనసాగుతోందన్నారు. ఇప్పటికే అన్ని పోలింగ్ బూత్‌లలో బీఎల్‌ఏలను నియమించామని తెలిపారు. ఎస్.ఐ.ఆర్‌ను సీరియస్‌గా తీసుకోవాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జిలకు ఆదేశాలు ఇచ్చారని తెలిపారు. బిహార్‌లో 76 లక్షల ఓట్లు, పశ్చిమ బెంగాల్‌లో 90 లక్షల ఓట్లను తొలగించారని.. ఆ రెండు రాష్ట్రాల్లోనూ బీజేపీ అధికారంలోకి వచ్చిందన్నారు.


కేరళలో కాంగ్రెస్ కార్యకర్తలు ముందుగానే అలర్ట్ కావడంతో కాపాడుకోగలిగామని ఎంపీ వెల్లడించారు. ఇప్పుడు తెలంగాణలోనూ అదే జరగబోతోందన్నారు. నెల రోజుల పాటు జరిగే SIR ప్రక్రియలో బీఎల్‌వోలు మూడు సార్లు ఇంటికి వచ్చే ప్రయత్నం చేస్తారన్నారు. తెలంగాణలో ఇప్పటికే 1 కోటి 2 లక్షల ఓట్లను అన్‌మ్యాప్ చేశారని.. అంటే దాదాపు 33 శాతం ఓట్లు అన్‌‌మ్యాప్ అయ్యాయని తెలిపారు. బీఎల్‌వోలు అప్రమత్తంగా లేకపోతే కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్న ఓట్లు కూడా తొలగిపోయే అవకాశం ఉందన్నారు. 2002 ఓటర్ లిస్ట్, 2025 ఓటర్ లిస్ట్, అన్‌మ్యాప్ ఓటర్ లిస్ట్‌ను దగ్గర పెట్టుకుని పరిశీలించాలని సూచించారు.


SIR ప్రక్రియను కాంగ్రెస్ క్యాడర్ అధిగమించాలని ఎంపీ తెలిపారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, కాంగ్రెస్ నేతలు అంతా SIR ప్రక్రియను పరిశీలించాలన్నారు. రెండు చోట్ల ఓటు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. నెల రోజుల పాటు బీఎల్‌వోలు బూత్‌ను విడిచి వెళ్లొద్దని ఆదేశించారు. ప్రతి పది బూత్‌లకు ఒక సూపర్‌వైజర్‌ను, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక సూపర్‌వైజర్‌ను పెడుతున్నామన్నారు. బీఎల్‌వోలతో నాయకులు నిరంతరం టచ్‌లో ఉండి.. SIR జరిగే విధానాన్ని పరిశీలించాలని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సూచనలు చేశారు.


ఇవి కూడా చదవండి...

రైళ్లపై రాళ్లేస్తే పట్టేస్తాయి!

ఈనెల 28న నల్లగొండకు సీఎం రేవంత్.. అభివృద్ధి పనులకు శంకుస్థాపన

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jun 25 , 2026 | 01:52 PM