దేవినేని నెహ్రూ లేకపోతే నువ్వు ఆఫ్ట్రాల్.. అవినాష్‌పై పట్టాభి ఫైర్
ABN , Publish Date - Jun 25 , 2026 | 11:47 AM
వైసీపీ నేత దేవినేని అవినాష్‌పై స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వాస్తవాలు మరచి గొడ్డలి పార్టీ నాయకులు నోరు పారేసుకుంటున్నారని మండిపడ్డారు.
విజయవాడ, జూన్ 25: వైసీపీ నేత దేవినేని అవినాష్‌పై స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈరోజు(గురువారం) మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ, అమరావతి గురించి దేవినేని నెహ్రూ గతంలో చేసిన వ్యాఖ్యలను మీడియాకు వినిపించామని అన్నారు. వాస్తవాలు మరచి గొడ్డలి పార్టీ నాయకులు నోరు పారేసుకుంటున్నారని మండిపడ్డారు. బెజవాడ పిల్ల సైకోగా ఉన్న దేవినేని అవినాష్ స్థాయిని మరచి మితిమీరి మాట్లాడున్నారని దుయ్యబట్టారు. ఇప్పటికే అవినాష్ మూడు పార్టీలు మారారని.. వైసీపీ ఓటమి తర్వాత మరోసారి పార్టీ మారాలని చూసినట్లు చెప్పారు. అధికారం లేకపోతే అవినాష్ ఉండలేరన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఉండటంతో పార్టీ మారే అవకాశం దక్కలేదన్నారు.
దేవినేని నెహ్రూ టీడీపీ ఆవిర్భావం నుంచి ఉన్నారని.. తరువాత కాంగ్రెస్‌లోకి వెళ్లినా మళ్లీ టీడీపీలోకి వచ్చారని పట్టాభి తెలిపారు. తుదిశ్వాస వరకు టీడీపీలో ఉండి పసుపు జెండాతోనే దివికేగారని అన్నారు. ఆ తండ్రి పేరు చెప్పి రాజకీయాల్లోకి వచ్చిన అవినాష్.. పిల్ల సైకోగా మారారంటూ విమర్శించారు. ఏ దారీ లేకపోవడంతో జగన్ ప్రాపకం కోసం చంద్రబాబు, లోకేశ్‌పై నోరు పారేసుకుంటున్నారని మండిపడ్డారు. వారి ప్రోత్సాహంతో తెలుగు యువత అధ్యక్షుడిగా, గుడివాడ ఎమ్మెల్యేగా అవినాష్ పోటీ చేశారని.. ఓటమిపాలైనా కూడా చంద్రబాబు అండగా నిలిచారని గుర్తుచేశారు. దేవినేని నెహ్రూ పార్థివదేహాన్ని చంద్రబాబు భుజాలపై మోశారని తెలిపారు. ఆ కుటుంబానికి అండగా ఉన్న చంద్రబాబుపై అవాకులు, చవాకులు పేలుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
బుడమేరు మట్టి మాఫియా వెనుక గొడ్టలి పార్టీ నేతలే ఉన్నారని పట్టాభి రామ్ ఆరోపించారు. ‘ఒకసారి టీడీపీ గురించి నీ తండ్రి చెప్పిన మాటలు వింటే నీకు వాస్తవం తెలుస్తుంది. తెలుగుదేశం పార్టీ నా సొంత ఇల్లే.. కాంగ్రెస్‌ను అద్దె ఇల్లుగా భావించాను అని నెహ్రూ చెప్పారు. పిల్ల సైకో.. నీ తండ్రి అన్న మాటలు ముందు తెలుసుకో. నిన్ను పక్కన ఉంచుకునే నెహ్రూ ఆ వ్యాఖ్యలు చేశారు. నువ్వు అదే టీడీపీ కార్యాలయంపై దాడికి వెళ్లావు. నీ చర్యల వల్ల నీ తండ్రి ఆత్మ క్షోభిస్తూ ఉంటుంది. నీ తండ్రి ఫొటో పెట్టుకుని రాజకీయం చేసే అర్హత నీకు లేదు. అసలు టీడీపీ నుంచి గొడ్డలి పార్టీకి వెళ్లినప్పుడే నీ తండ్రి ఆశయాలను చంపేశావు. నేను టీడీపీ జెండా తప్ప వేరే జెండా పట్టుకోను, పార్టీలు మార్చే మనస్తత్వం నాది కాదు అని నెహ్రూ చెప్పారు. అటువంటి నెహ్రూ లేకపోతే నువ్వు ఆఫ్ట్రాల్. అమరావతి అభివృద్ధికి అందరూ సహకారం ఇవ్వాలని నీ తండ్రి కోరితే. అక్కడి రైతులను జైళ్లకు పంపిన గొడ్డలి పార్టీలోకి వెళ్లి వారిని దూషిస్తావా. జగన్ పంచన చేరి విషం కక్కే పిల్ల సైకో... ఇక నుంచి నెహ్రూ వారసుడిని అని చెప్పుకోకు. ఇంకోసారి చంద్రబాబు, లోకేశ్ నోరు పారేసుకుంటే తగిన బుద్ధి చెబుతాం’ అంటూ అవినాష్‌ను కొమ్మారెడ్డి పట్టాభి రామ్ హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి...
సెట్స్‌పైకి బాలయ్య సరికొత్త చిత్రం #NBK112.. అమరావతిలో సినీ సందడి
ఏపీలో పెద్ద సినిమాకు క్లాప్ కొట్టి 20 ఏళ్లు అయింది: బాలకృష్ణ
Read Latest AP News And Telugu News