ఓ చిన్నారికి జన్మనిచ్చిన ఇంటర్ విద్యార్థిని, ఆపై రెండో అంతస్తు నుంచి..
ABN , Publish Date - Jun 25 , 2026 | 10:59 AM
హైదరాబాద్‌లోని ఓ ప్రభుత్వ కళాశాలలో నవజాత శిశువు మృతదేహం లభించడం కలకలం రేపింది. ఓ విద్యార్థిని (18) బిడ్డకు జన్మనిచ్చి, ఆపై హత్య చేసినట్లు ఆరోపణలు రావడం స్థానికంగా ప్రకంపనలు సృష్టిస్తోంది.
హైదరాబాద్: నగరంలోని ఓ ప్రభుత్వ కళాశాలలో నవజాత శిశువు మృతదేహం లభించడం కలకలం రేపింది. ఓ విద్యార్థిని (18) బిడ్డకు జన్మనిచ్చి, ఆపై హత్య చేసినట్లు ఆరోపణలు రావడం స్థానికంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ ఘటన గోల్కొండ ప్రాంతంలో చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జూన్ 23న కళాశాల ఆవరణలో ఓ చిన్నారి మృతదేహాన్ని కళాశాల సిబ్బంది గుర్తించారు. తీవ్ర భయాందోళనలకు గురైన వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
హుటాహుటిన అక్కడికి చేరుకున్న పోలీసులు.. నవజాత శిశువు మృతదేహాన్ని పరిశీలించారు. మరోవైపు ఫోరెన్సిక్ నిపుణులు రంగంలోకి దిగి సాక్ష్యాలను సేకరించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా పోలీసులు ఆ కళాశాల సీసీటీవీ కెమెరాల ఫుటేజ్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా వారిని షాక్‌కు గురిచేసే దృశ్యాలు అందులో కనిపించాయి.
కళాశాలలో చదువుతున్న ఓ ఇంటర్ విద్యార్థినే బిడ్డకు జన్మనిచ్చినట్లు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఆమె కళాశాల ఆవరణలోనే ప్రసవించి, ఆపై నవజాత శిశువును భవనం రెండో అంతస్తు నుంచి కిందికి విసిరేసిందని ఆరోపిస్తున్నారు. ఆ విద్యార్థినికి బంధువుల్లోని ఓ వ్యక్తితో సంబంధం ఉందని, డెలివరీ సమయానికి ఆమె ఎనిమిది నెలల గర్భవతి అని తెలిపారు. దర్యాప్తు కొనసాగుతోందని, మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
ముగ్గురితో వివాహేతర సంబంధాలున్నాయి.. విచారణలో అంగీకరించిన బిల్‌గేట్స్..
రైళ్లపై రాళ్లేస్తే పట్టేస్తాయి!