Share News

పెళ్లి వద్దని చెప్పి ఉండొచ్చు కదా.. ఎందుకు చంపారు: కేతన్ తండ్రి ఆవేదన

ABN , Publish Date - Jun 25 , 2026 | 11:28 AM

కాబోయే భార్య సియా గోయల్, చేతన్ చౌధరితో ప్రేమలో ఉందనే విషయం కేతన్ అగర్వాల్‌కు ఏమాత్రం తెలియదని ఆయన తండ్రి విశాల్ అగర్వాల్ తెలిపారు. అయితే సియా ఫోన్ గంటల తరబడి బిజీగా ఉండటంతో ఏదో తేడాగా ఉందని మాత్రం కేతన్‌కు అనిపించిందని తెలిపారు.

పెళ్లి వద్దని చెప్పి ఉండొచ్చు కదా.. ఎందుకు చంపారు: కేతన్ తండ్రి ఆవేదన
Pune fort killing

కాబోయే భార్య సియా గోయల్, చేతన్ చౌధరితో ప్రేమలో ఉందనే విషయం కేతన్ అగర్వాల్‌కు ఏమాత్రం తెలియదని ఆయన తండ్రి విశాల్ అగర్వాల్ తెలిపారు. అయితే సియా ఫోన్ గంటల తరబడి బిజీగా ఉండటంతో ఏదో తేడాగా ఉందని మాత్రం కేతన్‌కు అనిపించిందని తెలిపారు. ఒకవేళ సియా వేరొకరితో ప్రేమలో ఉన్నట్లు తెలిసి ఉంటే, తమ కుటుంబం పెళ్లిని రద్దు చేసుకునేదని విశాల్ పేర్కొన్నారు. మహారాష్ట్రలోని పుణె సమీపంలోని లోహగడ్ కోట వద్ద జరిగిన కేతన్ అగర్వాల్ హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది (Pune fort killing).


పెళ్లి ఇష్టం లేదని ముందే చెప్పి ఉంటే, తమ కుటుంబం వివాహాన్ని వెంటనే రద్దు చేసేదని విశాల్ అన్నారు. అమాయకుడైన తన కుమారుడిని హత్య చేయాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు. 'ఆమె సంతోషంగా లేదని మాకు తెలియదు. రోజు విడిచి రోజు కేతన్, సియా డిన్నర్లకు వెళ్లేవారు. సియా తన అఫైర్ గురించి కేతన్‌కు ఎప్పుడూ చెప్పలేదు. అయితే, సియా ఫోన్ ఎప్పుడూ బిజీగా ఉంటుందని కేతన్ ఒకసారి నాతో చెప్పాడు' అని విశాల్ చెప్పారు (Ketan Agarwal, Siya Goyal).


ఫోన్ ఎప్పుడూ బిజీగా ఉండటం గురించి కేతన్ నిలదీయగా, తాను తన స్నేహితులతో మాట్లాడుతున్నానని సియా చెప్పిందని విశాల్ పేర్కొన్నారు (Pune crime news). 'కేతన్‌ను పెళ్లి చేసుకోవాలని మేము సియాను బలవంతం చేయలేదు. అయితే సియా ప్రేమ వ్యవహారం గురించి ఆమె తల్లిదండ్రులకు, అత్తకు ముందుగానే తెలిసి ఉండొచ్చు. వారే కేతన్‌ను పెళ్లి చేసుకోవాలని సియాపై ఒత్తిడి తీసుకొచ్చి ఉంటారు. అన్ని విషయాలు పోలీసుల దర్యాప్తులో తెలుస్తాయి' అని విశాల్ తెలిపారు.


ఇవి కూడా చదవండి..

బంగారం ధరలు మరింత తగ్గాయి.. ప్రస్తుతం ఎలా ఉన్నాయంటే..


వెనెజువెలాలో రెండు భూకంపాలు.. కారకస్‌లో వణికిపోయిన భవనాలు..

Updated Date - Jun 25 , 2026 | 11:32 AM