Share News

బుడమేరు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతాం: ఎంపీ కేశినేని చిన్ని..

ABN , Publish Date - Jun 25 , 2026 | 01:31 PM

అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారుల పోషకాహారాన్ని మెరుగుపరిచే లక్ష్యంతో ‘బాలామృతం+’ని విజయవాడలో ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాల పురోగతిపై సమీక్ష నిర్వహించినట్లు ఆయన తెలిపారు.

బుడమేరు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతాం: ఎంపీ కేశినేని చిన్ని..
MP Kesineni Chinni

విజయవాడ: అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారుల పోషకాహారాన్ని మెరుగుపరిచే లక్ష్యంతో ‘బాలామృతం+’ని విజయవాడలో ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాల పురోగతిపై సమీక్ష నిర్వహించినట్లు ఆయన తెలిపారు. వీబీ జీరాంజీ మాదిరిగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పాత పథకాలనే కొత్త పేర్లతో అమలు చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయని వ్యాఖ్యానించారు. సమీక్ష సందర్భంగా ఎన్టీఆర్ జిల్లాలోని వివిధ సమస్యలపైనా విస్తృతంగా చర్చించినట్లు ఎంపీ చిన్ని పేర్కొన్నారు.


ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించిన సమస్యలపై త్వరలో ప్రత్యేక సమావేశం నిర్వహించి పరిష్కార మార్గాలను అన్వేషిస్తామని ఎంపీ చిన్ని చెప్పారు. సమస్యల పరిష్కారంలో జిల్లా ఏపీలోనే ముందంజలో ఉందని ఆయన తెలిపారు. అయితే వివిధ శాఖల మధ్య సమన్వయం కొంతమేర లోపించడం వల్ల కొన్ని అభివృద్ధి కార్యక్రమాల అమలులో ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. రైల్వే నెట్‌వర్క్‌కు సంబంధించిన సమస్యలు స్పష్టంగా కనిపిస్తున్నాయని, వాటి పరిష్కారంపై దృష్టి సారించినట్లు తెలిపారు. శాటిలైట్ రైల్వేస్టేషన్లతో పాటు కొండపల్లి ప్రాంతానికి కూడా త్వరలో బస్సు సౌకర్యం కల్పించనున్నట్లు వెల్లడించారు.


విజయవాడ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న బుడమేరు గండి సమస్యపైనా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని ఎంపీ తెలిపారు. త్వరలోనే బుడమేరు సమస్యకు శాశ్వత పరిష్కారం తీసుకువస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఇతర రాష్ట్రాల్లో అమలు చేస్తున్న విధానాలకు భిన్నంగా, బుడమేరు నిర్వాసితులకు తగిన పునరావాస సదుపాయాలు కల్పిస్తూ సమస్యను పరిష్కరించే దిశగా చర్యలు చేపడతామని ఎంపీ కేశినేని చిన్ని పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

గుంతకల్లు మీదుగా ప్రత్యేక రైలు

ప్రజాసేవే లక్ష్యం.. అమరావతిలో శరవేగంగా బసవతారకం ఆస్పత్రి నిర్మిస్తున్నాం: బాలకృష్ణ

Updated Date - Jun 25 , 2026 | 01:48 PM