Share News

గుంతకల్లు మీదుగా ప్రత్యేక రైలు

ABN , Publish Date - Jun 25 , 2026 | 12:17 PM

ప్రయాణికుల రద్దీని తగ్గించడానికి జల్నా-యల్హంక-జల్నా మధ్య (వయా గుంతకల్లు) నెల రోజులపాటు వీక్లీ ప్రత్యేక రైలును నడపనున్నట్లు రైల్వే అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.

గుంతకల్లు మీదుగా ప్రత్యేక రైలు
Special Weekly Train

గుంతకల్లు(అనంతపురం): ప్రయాణికుల రద్దీని తగ్గించడానికి జల్నా-యల్హంక-జల్నా మధ్య (వయా గుంతకల్లు) నెల రోజులపాటు వీక్లీ ప్రత్యేక రైలును నడపనున్నట్లు రైల్వే అధికారులు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. జల్నా-యల్హంక ప్రత్యేక వీక్లీ రైలు (07601)ను ఈ నెల 28 నుంచి జూలై 26 వరకూ ఆదివారాలలో ఐదు ట్రిప్పులు నడపనున్నారు. ఈ రైలు జల్నాలో సాయంత్రం 7-20 గంటలకు బయలుదేరి మరుసటిరోజు రాత్రి తొమ్మిదిన్నరకు యల్హంకకు చేరుకుంటుందన్నారు.


train2.jpgఈ రైలు హిందూపురం, ధర్మవరం, అనంతపురం, గుత్తి, గుంతకల్లు, ఆదోని, మంత్రాలయం రోడ్డు, రాయచూరు, యాదగిరి, తాండూరు, వికారాబాద్‌, లింగంపల్లి, బేగంపేట, సికిందాబ్రాద్‌, బొల్లారం, మేడ్చల్‌, కామారెడ్డి, నిజామాబాద్‌, బాసర, ధర్మాబాద్‌, ముడ్‌ఖేడ్‌, నాందేడ్‌, పూర్ణా, పర్బని, సేలు, పర్తూర్‌ మీదుగా జల్నాకు చేరుకుంటుందన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

హ్యాకర్స్‌ కాదు పిల్లల పనే!

రైళ్లపై రాళ్లేస్తే పట్టేస్తాయి!

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Jun 25 , 2026 | 12:17 PM