పెళ్లిపీటలెక్కిన టీమిండియా క్రికెటర్
ABN , Publish Date - Jun 25 , 2026 | 10:51 AM
టీమిండియా క్రికెటర్ ఆకాశ్‌దీప్ వివాహం బుధవారం రాత్రి ఘనంగా జరిగింది. తన స్నేహితురాలు అక్షిత రాజ్‌ను ఆకాశ్ వివాహం చేసుకొన్నాడు.
స్పోర్ట్స్ డెస్క్: భారత జట్టు క్రికెటర్ ఆకాశ్‌దీప్ వివాహం బంధంలోకి అడుగు పెట్టాడు. అతడి పెళ్లి బుధవారం రాత్రి వారణాసిలో అంగరంగ వైభవంగా జరిగింది. తన స్నేహితురాలు అక్షిత రాజ్‌కు మూడుముళ్లు వేసి ఆకాశ్ వివాహం చేసుకొన్నాడు. నగరంలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్‌లో జరిగిన వేడుకలో పెళ్లిదుస్తుల్లో అకాశ్ దీప్ ఆకట్టుకున్నాడు. ఈ కార్యక్రమానికి భోజ్‌పురి సింగర్ పవన్ సింగ్, ఆకాశ్ మిత్రుడు, క్రికెటర్ ముఖేశ్ కుమార్ హాజరయ్యారు. అలానే పలువురు సెలబ్రిటీలు సైతం ఈ వివాహానికి హాజరయ్యారు.
ఆకాశ్, అక్షితల వివాహం ఇరు కుటుంబాల అంగీకారంతో సంప్రదాయ పద్ధతిలో జరిగింది. వీరి వివాహ వేడుకలు నాలుగు రోజుల క్రితమే ప్రారంభమైంది. వరుడి పూర్వీకుల నివాసం ఉన్న బడ్డీ గ్రామంలో పెళ్లికి ముందు సంప్రదాయ కార్యక్రమాలను నిర్వహించారు. ఆ తర్వాత వివాహలోని ప్రధాన వేడుకను వారణాసిలోని ఓ ఫైవ్‌స్టార్ హోటల్ వేదికగా ఘనంగా నిర్వహించారు.
ఈ వేడుకకు కుటుంబ సభ్యులు, సన్నిహితులను మాత్రమే ఆహ్వానించారు. ఇక వధువు విషయానికి వస్తే.. అక్షిత రాజ్ స్వస్థలం బిహార్‌లోని రోహ్‌తస్ జిల్లా. ఆమె బిట్స్‌పిలానీలో బీసీఏ, ఎంసీఏ పూర్తి చేశారు. ఆకాశ్, అక్షిత చాలా కాలం ఫ్రెండ్స్ గా ఉండి.. ఆ తర్వతా ప్రేమలో పడ్డారు. చాలా కాలం పాటు ప్రేమించుకుని.. పెద్దలను ఒప్పించుకుని చివరకు పెళ్లితో ఒక్కటయ్యారు.
ఇవి కూడా చదవండి: