Share News

మునోజ్‌ ఏకైక గోల్‌

ABN , Publish Date - Jun 25 , 2026 | 05:28 AM

డేనియల్‌ మునోజ్‌ ఏకైక గోల్‌తో.. కొలంబియా నాకౌట్‌కు చేరుకొంది. గ్రూప్‌-కెలో బుధవారం జరిగిన మ్యాచ్‌లో కొలంబియా 1-0తో డీఆర్‌ కాంగోపై గెలిచింది. ఆడిన రెండు మ్యాచ్‌ల్లో నెగ్గి...

మునోజ్‌ ఏకైక గోల్‌

ఫిఫా కప్‌ మ్యాచ్‌లు

దక్షిణాఫ్రికా X ద.కొరియా

(ఉదయం 6.30)

మెక్సికో X చెక్‌ రిపబ్లిక్‌

(ఉదయం .6.30)

ఐవరీ కోస్ట్‌ X కురకావో

( అర్ధరాత్రి 1.30)

జర్మనీ X ఈక్వెడార్‌

( అర్ధరాత్రి 1.30)

నెదర్లాండ్స్‌ X ట్యునీషియా

(శుక్రవారం తెల్లవారుజాము 4.30)

జపాన్‌ X స్వీడన్‌

(శుక్రవారం తెల్లవారుజాము 4.30)

నాకౌట్‌కు కొలంబియా

డీఆర్‌ కాంగోపై గెలుపు

వదులహారుహ్‌ (మెక్సికో): డేనియల్‌ మునోజ్‌ ఏకైక గోల్‌తో.. కొలంబియా నాకౌట్‌కు చేరుకొంది. గ్రూప్‌-కెలో బుధవారం జరిగిన మ్యాచ్‌లో కొలంబియా 1-0తో డీఆర్‌ కాంగోపై గెలిచింది. ఆడిన రెండు మ్యాచ్‌ల్లో నెగ్గి ఆరు పాయింట్లతో రౌండ్‌-32 బెర్త్‌ను ఖరారు చేసుకొంది. డేనియల్‌ మునోజ్‌ 76వ నిమిషంలో గోల్‌ చేశాడు. మ్యాచ్‌ ఆరంభమైన తొలి 20 నిమిషాల్లో కొలంబియా ఉద్ధృతంగా దాడులు చేసినా.. కాంగో కీపర్‌ లియోనెల్‌ ఎంపాసి అద్భుతంగా అడ్డుకొన్నాడు. దీంతో ఫస్టా్‌ఫలో కాంగో డిఫెన్స్‌ను బ్రేక్‌ చేయడానికి కొలంబియా ఎంతగా ప్రయత్నించినా కూడా సఫలం కాలేకపోయింది. ఇక, సెకండాఫ్‌లో కూడా కాంగో పటిష్ట డిఫెన్స్‌తో కొలంబియాకు సవాల్‌ విసిరింది. అయితే, 76వ నిమిషంలో కాంగో పెనాల్టీ ఏరియాలో డిఫెండర్‌కు తగిలి వెనక్కివచ్చిన బంతిని మునోజ్‌ నేరుగా గోల్‌లోకి కొట్టడంతో కొలంబియా 1-0తో నిలిచింది. చివరి వరకు కొలంబియా ఇదే ఆధిక్యాన్ని నిలబెట్టుకొంది. సెకండాఫ్‌ స్టాపేజ్‌ టైమ్‌లో స్కోరు సమం చేసేందుకు కాంగోకు రెండు చక్కటి అవకాశాలు లభించినా.. కొలంబియా కీపర్‌ కమిలో వార్గస్‌ అప్రమత్తతతో వాటిని అడ్డుకొన్నాడు. గ్రూప్‌లో ఆఖరి మ్యాచ్‌లో పోర్చుగల్‌తో కొలంబియా తలపడనుంది. ఈ మ్యాచ్‌ను కనీసం డ్రా చేసుకుంటే కొలంబియా గ్రూప్‌ టాపర్‌గా, పోర్చుగల్‌ రెండో స్థానంతో గ్రూపులో తమ స్థానాలను ఖరారు చేసుకుంటాయి.


4-Sports.jpg

ఇంగ్లండ్‌ను నిలువరించిన ఘనా

ఫాక్స్‌బరో (యూఎస్‌): మ్యాచ్‌లో ఇంగ్లండ్‌దే పూర్తి ఆధిపత్యం. 80 శాతం బంతి హ్యారీకేన్‌ సేన ఆధీనంలో ఉంది. కానీ, బలమైన ఇంగ్లండ్‌ను గోల్‌ చేయనీయకుండా ఘనా సమర్థంగా అడ్డుకొంది. మ్యాచ్‌ ఆసాంతం పటిష్ట డిఫెన్స్‌తో ఇంగ్లండ్‌ను తీవ్ర అసహనానికి గురి చేసింది. దీంతో గ్రూప్‌-ఎల్‌లో ఇంగ్లండ్‌-ఘనా మధ్య మ్యాచ్‌ 0-0తో గోల్‌ రహిత డ్రాగా ముగిసింది. సెకండాఫ్‌ 86వ నిమిషంలో ఇంగ్లండ్‌కు గోల్‌ చేసే సువర్ణావకాశం దక్కింది. అయితే, నికో ఒరిల్లే కొట్టిన హెడర్‌ గోల్‌ బార్‌కు తగిలి రీబౌండ్‌ అయింది. దాన్ని హ్యారీకేన్‌ అందుకొన్నా.. అతడు కొట్టిన కిక్‌ గురి తప్పింది.

క్రొయేషియా రేసులోనే..

టొరంటో (కెనడా): యాంటీ బుడిమిర్‌ గోల్‌తో.. క్రొయేషియా నాకౌట్‌ ఆశలను సజీవంగా నిలబెట్టుకొంది. గ్రూప్‌-ఎల్‌లో జరిగిన మ్యాచ్‌లో క్రొయేషియా 1-0తో పనామాపై గెలిచింది. 54వ నిమిషంలో జోసిప్‌ స్టానిసిక్‌ ఇచ్చిన పాస్‌ను బుడిమిర్‌ నేరుగా గోల్‌లోకి పంపాడు. క్రొయేషియా స్టార్‌ లూకా మోద్రిచ్‌కు ఇది 200వ మ్యాచ్‌ కావడం విశేషం. కాగా, ఈ ఓటమితో పనామా జట్టు నాకౌట్‌ ఆశలు ఆవిరయ్యాయి.

ఇవి కూడా చదవండి

సంపులో పడి చిన్నారి మృతి.. తట్టుకోలేక నాయనమ్మ కన్నుమూత!

టీమిండియాతోనే పయనం.. కానీ మ్యాచ్‌కు ముందు వైభవ్‌కు ప్రత్యేక రూమ్!

Updated Date - Jun 25 , 2026 | 05:28 AM