Share News

గోడౌన్ కూలిన ఘటనలో 8కి చేరిన మృతులు

ABN , Publish Date - Jun 25 , 2026 | 08:10 AM

కోల్‌కతాలోని తరతల ప్రాంతంలో గోడౌన్ కుప్పకూలిన సంఘటనలో మరణించిన వారి సంఖ్య 8కి పెరిగింది. ఈ ఘటనలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు.

గోడౌన్ కూలిన ఘటనలో 8కి చేరిన మృతులు
Warehouse Collapse In Kolkata

కోల్‌కతా, జూన్ 25: మహానగరంలోని తరతల ప్రాంతంలో గోడౌన్ కుప్పకూలిన సంఘటనలో మరణించిన వారి సంఖ్య 8కి పెరిగింది. ఈ ఘటనలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించామని అధికారులు వివరించారు. మరో18 మంది గోడౌన్ శిథిలాల కింద చిక్కుకున్నారని తెలిపారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో గోడౌన్‌లో 60 మంది వరకు కార్మికులు ఉన్నారని వివరించారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, భారత ఆర్మీ, నగర పోలీసులతోపాటు స్థానికుల సహకారంతో సహయక చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు.


ఈ ప్రమాదంపై సమాచారం అందుకోగానే.. మంత్రులతో కలిసి సీఎం సువేందు అధికారి ఘటన స్థలానికి చేరుకున్నారు. స్వయంగా సహాయక చర్యలను పర్యవేక్షించారు. మరో వైపు బాధితుల కుటుంబ సభ్యుల కోసం రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ కంట్రోల్ రూం.. 8697981070, 033 22143526, 033 22535185 నెంబర్లు విడుదల చేసింది. బుధవారం సాయంత్రం ఈ గోడౌన్ కూలిన సంగతి తెలిసిందే. ఈ ఘటన జరిగిన వెంటనే ఐదుగురు కార్మికులు మరణించగా.. 20 మంది తీవ్రంగా గాయపడిన విషయం విదితమే.


ఈ వార్తలు కూడా చదవండి..

పాక్ గగనతలంలోకి ఎయిర్ ఇండియా విమానం..

పౌరసత్వానికి పాస్‌పోర్టు రుజువు కాదు!

For More National News And Telugu News

Updated Date - Jun 25 , 2026 | 08:27 AM