Share News

విరాట్‌ను వెనక్కు నెట్టి.. నెం.2గా గిల్‌

ABN , Publish Date - Jun 25 , 2026 | 05:18 AM

అఫ్ఘానిస్థాన్‌తో మూడు మ్యాచ్‌ల సిరీ్‌సలో అదరగొట్టిన భారత్‌ కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ (791 పాయింట్లు) వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో రెండో ర్యాంకుకు దూసుకొచ్చాడు...

విరాట్‌ను వెనక్కు నెట్టి.. నెం.2గా గిల్‌

వన్డే బ్యాటింగ్‌ ర్యాంకింగ్స్‌

దుబాయ్‌: అఫ్ఘానిస్థాన్‌తో మూడు మ్యాచ్‌ల సిరీ్‌సలో అదరగొట్టిన భారత్‌ కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ (791 పాయింట్లు) వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో రెండో ర్యాంకుకు దూసుకొచ్చాడు. ఈ క్రమంలో ఐదో స్థానంలో ఉన్న గిల్‌... వెటరన్‌ బ్యాటర్లు విరాట్‌ కోహ్లీ (మూడో ర్యాంక్‌), రోహిత్‌ శర్మ (నాలుగో ర్యాంక్‌)లను అధిగమించాడు. న్యూజిలాండ్‌కు చెందిన డారిల్‌ మిచెల్‌ (815 పాయింట్లు) టాప్‌లో నిలిచాడు. ఇషాన్‌ కిషన్‌ 21 స్థానాలను మెరుగుపరుచుకొని 21వ ర్యాంక్‌కు చేరాడు. బౌలర్లలో అర్ష్‌దీప్‌ 22, ప్రసిద్ధ్‌ 58వ ర్యాంక్‌ సాధించారు. టెస్ట్‌ బౌలర్ల ర్యాంకింగ్స్‌లో బుమ్రా (870)తో కలిసి మాట్‌ హెన్రీ టాప్‌లో నిలిచాడు. బ్యాటర్లలో ఇంగ్లండ్‌కు చెందిన జో రూట్‌ టాప్‌ ర్యాంకులోనే ఉన్నాడు.

ఇవి కూడా చదవండి

సంపులో పడి చిన్నారి మృతి.. తట్టుకోలేక నాయనమ్మ కన్నుమూత!

టీమిండియాతోనే పయనం.. కానీ మ్యాచ్‌కు ముందు వైభవ్‌కు ప్రత్యేక రూమ్!

Updated Date - Jun 25 , 2026 | 05:19 AM