జ్యోతికి ఆసియాడ్ బెర్త్
ABN , Publish Date - Jun 25 , 2026 | 05:24 AM
మోకాలి గాయం కారణంగా కొన్నాళ్లుగా ట్రాక్‌కు దూరమైన తెలుగమ్మాయి జ్యోతి యర్రాజీ పునరాగమనంలో అదరగొట్టింది. దాదాపు ఏడాది తర్వాత తాను పోటీపడ్డ తొలి టోర్నీ జాతీయ...
భువనేశ్వర్: మోకాలి గాయం కారణంగా కొన్నాళ్లుగా ట్రాక్‌కు దూరమైన తెలుగమ్మాయి జ్యోతి యర్రాజీ పునరాగమనంలో అదరగొట్టింది. దాదాపు ఏడాది తర్వాత తాను పోటీపడ్డ తొలి టోర్నీ జాతీయ అంతర్రాష్ట్ర అథ్లెటిక్స్ చాంపియన్‌షి్‌పలోనే ప్రతిష్టాత్మక ఆసియా క్రీడలకు అర్హత టైమింగ్‌ను అందుకుంది. బుధవారం జరిగిన 100 మీటర్ల హర్డిల్స్ హీట్ రేస్‌ను జ్యోతి 13.14 సెకన్లలోనే ముగించి ఆసియాడ్ బెర్త్ దక్కించుకుంది. తన ఈవెంట్‌లో ఆసియాడ్‌కు అర్హత సమయం 13.34 సెకన్లు కాగా.. అంతకంటే తక్కువ సమయంలోనే జ్యోతి పరిగెత్తడం విశేషం. వైజాగ్‌కు చెందిన 26 ఏళ్ల జ్యోతి 2022 ఆసియా క్రీడల్లో రజ తం సాధించింది. కాగా, ఆసియా చాంపియన్, జాతీయ రికార్డు గ్రహీత గుల్వీర్ సింగ్ 5 వేల మీటర్ల రేసును 13 నిమిషాల 52.92 సెకన్లలో ముగించి విజేతగా నిలిచాడు. కానీ, ఆసియాడ్‌కు అర్హత ప్రమాణమైన 13 నిమిషాల 39.18 సెకన్ల టైమింగ్‌ను మాత్రం దాటలేకపోయాడు.
ఇవి కూడా చదవండి
సంపులో పడి చిన్నారి మృతి.. తట్టుకోలేక నాయనమ్మ కన్నుమూత!
టీమిండియాతోనే పయనం.. కానీ మ్యాచ్‌కు ముందు వైభవ్‌కు ప్రత్యేక రూమ్!