Share News

భూమి సమస్యలపై ఏఐ సాయంతో ఉత్తర్వులా?

ABN , Publish Date - Nov 04 , 2026 | 05:44 AM

భూవివాదాలు, రెవెన్యూశాఖ వ్యవహారాల్లో ఇచ్చే ఉత్తర్వుల ప్రభావం సాధారణ ప్రజలు, రైతుల హక్కులపై తీవ్రంగా ఉంటుందని, అలాంటి విషయాల్లో కలెక్టర్‌ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఎలా అని హైకోర్టు ప్రశ్నించింది.

భూమి సమస్యలపై ఏఐ సాయంతో ఉత్తర్వులా?
Telangana High Court

  • జనగామ కలెక్టర్‌పై హైకోర్టు ఆగ్రహం

హైదరాబాద్‌, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి): భూవివాదాలు, రెవెన్యూశాఖ వ్యవహారాల్లో ఇచ్చే ఉత్తర్వుల ప్రభావం సాధారణ ప్రజలు, రైతుల హక్కులపై తీవ్రంగా ఉంటుందని, అలాంటి విషయాల్లో కలెక్టర్‌ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఎలా అని హైకోర్టు ప్రశ్నించింది. భూమి సమస్యల దరఖాస్తుల విషయంలో జనగామ కలెక్టర్‌ కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌- ఏఐ) వినియోగించి ఉత్తర్వులు ఇస్తుండటాన్ని తప్పుబట్టింది. సెప్టెంబర్‌ 8న ఆ కలెక్టర్‌ ఇచ్చిన ఉత్తర్వులను సస్పెండ్‌ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది.


దీనిపై వివరణ ఇవ్వాలని రెవెన్యూశాఖ ముఖ్యకార్యదర్శి, జనగామ కలెక్టర్‌, దేవరుప్పుల తహసీల్దార్‌ తదితరులకు నోటీసులు జారీచేసింది. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ వినియోగంపై వివరణ ఇవ్వాలని అడ్వకేట్‌ జనరల్‌ సుదర్శన్‌రెడ్డికి ఉత్తర్వులు జారీచేసింది. జనగామ జిల్లా దేవరుప్పుల మండలం పెద్దమడూర్‌కు చెందిన మేడిపల్లి కొమురయ్య దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్‌ శ్రవణ్‌కుమార్‌ ధర్మాసనం విచారణ చేపట్టింది. వాదనలు విన్న ధర్మాసనం.. జనగామ కలెక్టర్‌ తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. తదుపరి విచారణను 18కి వాయిదా వేసింది.


ఈ వార్తలు కూడా చదవండి:

మారుమూల ప్రాంతాల్లో పనిచేస్తే ‘అడిగినంత’ జీతం

కోట్లకొద్దీ నకిలీ నోట్లు!

ఒంగోలు సమీపంలో తీరం దాటిన మురసు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Nov 04 , 2026 | 05:44 AM