Share News

పీసీబీ అనుమతులపై అప్పీల్‌ చేసుకోవచ్చు

ABN , Publish Date - Nov 04 , 2026 | 05:59 AM

క్వారీయింగ్‌, బ్లాస్టింగ్‌, క్రషింగ్‌ వంటి కార్యాకలాపాలకు తెలంగాణ పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు (పీసీబీ) ఇచ్చిన అనుమతులు నచ్చకపోతే వాటిపై పీసీబీ అప్పీలేట్‌ అథారిటీ వద్ద అప్పీల్‌ చేసుకునే అవకాశం ప్రజలకు ఉంటుందని హైకోర్టు పేర్కొంది.

పీసీబీ అనుమతులపై అప్పీల్‌ చేసుకోవచ్చు
Telangana High Court

  • అప్పిలేట్‌ అథారిటీని ఆశ్రయించవచ్చు: హైకోర్టు

హైదరాబాద్‌, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి): క్వారీయింగ్‌, బ్లాస్టింగ్‌, క్రషింగ్‌ వంటి కార్యాకలాపాలకు తెలంగాణ పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు (పీసీబీ) ఇచ్చిన అనుమతులు నచ్చకపోతే వాటిపై పీసీబీ అప్పీలేట్‌ అథారిటీ వద్ద అప్పీల్‌ చేసుకునే అవకాశం ప్రజలకు ఉంటుందని హైకోర్టు పేర్కొంది. రంగారెడ్డి జిల్లా ఆమనగల్‌ మండలం ఆకుతోటిపల్లి గ్రామంలోని సర్వే నంబర్లు 302, 304లో జరుగుతున్న క్రషింగ్‌, బ్లాస్టింగ్‌ కార్యకలాపాలను ప్రభుత్వం, పీసీబీ సమర్థంగా నియంత్రించడం లేదని ఆరోపిస్తూ అంజిరెడ్డి అనే రైతు దాఖలు చేసి న పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఈ సూచన చేసింది.


ఈ పిటిషన్‌పై ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. వాదనలు విన్న ధర్మాసనం.. కోర్టుకు ఇచ్చిన సమాచారానికి విరుద్ధంగా అక్కడ పనులు ప్రారంభించరాదని పేర్కొంది. పనులు ప్రారంభిస్తే పిటిషనర్‌ కోర్టు ధిక్కరణ పిటిషన్‌ దాఖలు చేయవచ్చని తెలిపింది. అవసరమైతే పీసీబీ అప్పీలేట్‌ అథారిటీ వద్ద అప్పీల్‌ చేసుకోవచ్చని సూచించింది. కాగా, దేవాదాయశాఖకు హైకోర్టు డివిజన్‌ బెంచ్‌లో మంగళవారం స్పల్ప ఊరట లభించింది. రిజిస్ట్రేషన్‌ యాక్ట్‌ సెక్షన్‌ 22-ఏ (నిషేధిత జాబితా)లో చేరుస్తూ గెజిట్‌ నోటిఫికేషన్‌ ఇవ్వని భూముల రిజిస్ట్రేషన్‌ ఆపడానికి వీల్లేదని సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులపై డివిజన్‌ బెంచ్‌ యథాతథస్థితి విధించింది.


ఈ వార్తలు కూడా చదవండి:

మారుమూల ప్రాంతాల్లో పనిచేస్తే ‘అడిగినంత’ జీతం

కోట్లకొద్దీ నకిలీ నోట్లు!

ఒంగోలు సమీపంలో తీరం దాటిన మురసు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Nov 04 , 2026 | 05:59 AM