Share News

ఎంపిక చేసుకొని దాడులు ఎందుకు?

ABN , Publish Date - Nov 07 , 2026 | 05:29 AM

ఎంపిక చేసుకొని కొన్ని ఆహారపదార్థాల విక్రయ సంస్థలపై మాత్రమే దాడులు ఎందుకు చేస్తున్నారని, అన్ని హోటల్స్‌, స్వీట్స్‌ తయారీ కేంద్రాలను ఎందుకు తనిఖీలు చేయడంలేదని వైద్య- ఆరోగ్యశాఖ, ఆహార భద్రత అధికారులను హైకోర్టు ప్రశ్నించింది.

ఎంపిక చేసుకొని దాడులు ఎందుకు?
Telangana High Court

  • అన్ని ఆహార కేంద్రాల్లో తనిఖీలు చేయండి

  • పుల్లారెడ్డి స్వీట్స్‌ కేసులో హైకోర్టు ఆదేశాలు

  • బొద్దింకలు, ఇతర లోపాలు ఉండడంతో లైసెన్స్‌ రద్దు చేశామన్న అధికారులు

హైదరాబాద్‌, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): ఎంపిక చేసుకొని కొన్ని ఆహారపదార్థాల విక్రయ సంస్థలపై మాత్రమే దాడులు ఎందుకు చేస్తున్నారని, అన్ని హోటల్స్‌, స్వీట్స్‌ తయారీ కేంద్రాలను ఎందుకు తనిఖీలు చేయడంలేదని వైద్య- ఆరోగ్యశాఖ, ఆహార భద్రత అధికారులను హైకోర్టు ప్రశ్నించింది. కొందరిపై మాత్రమే దాడులు చేస్తుండడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రజారోగ్యం దృష్ట్యా వివక్ష లేకుండా అన్ని వ్యాపార సంస్థలు ఆహార నాణ్యత, పరిశుభ్రత పాటించేలా, చట్టాలు అమలు చేయాలని పేర్కొంది. జి.పుల్లారెడ్డి స్వీట్స్‌కు చెందిన సనత్‌నగర్‌ తయారీ కేంద్రంలో తనిఖీలు నిర్వహించిన అధికారులు.. సరైన ఆహార భద్రతా ప్రమాణాలు పాటించడం లేదని పేర్కొంటూ ఫుడ్‌ లైసెన్స్‌ను సస్పెండ్‌ చేశారు.


ఏకపక్షంగా సస్పెండ్‌ చేయడం చెల్లదని, అన్ని లోపాలను సవరించుకున్నందున దానిని పునరుద్ధరించాలని కోరుతూ ఆ సంస్థ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై ఇటీవల విచారణ చేపట్టిన జస్టిస్‌ ఎన్వీ శ్రవణ్‌కుమార్‌ ధర్మాసనం.. మరోసారి తనిఖీలు చేపట్టి లోపాలు సవరించుకున్నారో లేదో పరిశీలించాలని అధికారులకు సూచించింది. శుక్రవారం విచారణ సందర్భంగా అధికారులు సమాధానం ఇస్తూ బొద్దింకలు, ఇతర లోపాలు అలాగే ఉన్నట్లు పేర్కొన్నారు. దాంతో లైసెన్స్‌పై సస్పెన్షన్‌ ఎత్తివేసేందుకు ధర్మాసనం నిరాకరించింది. ఎంపిక చేసుకుని దాడులు చేయకుండా అన్ని కేంద్రాల్లో తనిఖీలు చేపట్టాలని పేర్కొంటూ విచారణను ఈనెల 18కి వాయిదా వేసింది.

పుస్తకాల కొనుగోలు ఒత్తిడిపై చర్యలేవి?

ఎన్సీఈఆర్టీ ముద్రించినవి కాకుండా ఇతర పుస్తకాలు కొనుగోలు చేయాలని విద్యార్థులపై ఒత్తిడి తెస్తున్న ప్రైవేటు స్కూళ్లపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో వివరించాలని సీబీఎ్‌సఈకి జస్టిస్‌ ఎన్వీ శ్రవణ్‌కుమార్‌ ధర్మాసనం ఆదేశాలు జారీచేసింది. తదుపరి విచారణ ఈనెల 12కు వాయిదాపడింది.


ఈ వార్తలు కూడా చదవండి..

కాళేశ్వరంపై అసెంబ్లీ!

మరో రెండు పథకాలు

కొడంగల్‌లో రేపటి నుంచి సీఎం పర్యటన

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Nov 07 , 2026 | 05:29 AM