Share News

లైసెన్స్‌ సస్పెండైనా న్యాయవాదిగా రావడమా?

ABN , Publish Date - Oct 27 , 2026 | 06:03 AM

లైసెన్స్‌ సస్పెండ్‌ అయినప్పటికీ ఆ విషయాన్ని దాచిపెట్టి న్యాయవాదిగా కోర్టు ఎదుట హాజరుకావడం మోసం చేయడం కిందికే వస్తుందని హైకోర్టు పేర్కొంది.

లైసెన్స్‌ సస్పెండైనా న్యాయవాదిగా రావడమా?
Telangana High Court

  • ఎఫ్‌ఐఆర్‌ నమోదుకు హైకోర్టు ఆదేశాలు

హైదరాబాద్‌, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): లైసెన్స్‌ సస్పెండ్‌ అయినప్పటికీ ఆ విషయాన్ని దాచిపెట్టి న్యాయవాదిగా కోర్టు ఎదుట హాజరుకావడం మోసం చేయడం కిందికే వస్తుందని హైకోర్టు పేర్కొంది. అడ్వకేట్‌గా ప్రాక్టీస్‌ చేయకుండా రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌ సస్పెన్షన్‌ విధించినప్పటికీ న్యాయవాది ఏ ఉషి రెడ్డి.. వకాలత్‌ దాఖలు చేయడమే కాకుండా, అడ్వకేట్‌ బ్యాండ్‌తో హాజరు కావడాన్ని తప్పుపట్టింది. ఓ కేసు విచారణ సందర్భంగా జస్టిస్‌ నగేశ్‌ భీమపాక ధర్మాసనం ఈ విషయాన్ని గుర్తించింది. ఆ న్యాయవాదిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడానికి వీలుగా పోలీసులకు ఫిర్యాదు చేయాలని రిజిస్ట్రార్‌ (మేనేజ్‌మెంట్‌)కు ఆదేశాలు జారీచేసింది. మోసం చేయడం ద్వారా న్యాయపాలనలో అక్రమంగా జోక్యం చేసుకున్నందుకు కోర్టు ధిక్కరణ చర్యలు ప్రారంభించాలని కూడా సూచించింది.


కేసు విచారణ సందర్భంగా జస్టిస్‌ నగేశ్‌ భీమపాక ధర్మాసనం ఈ విషయాన్ని గుర్తించింది. ఆ న్యాయవాదిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడానికి వీలుగా పోలీసులకు ఫిర్యాదు చేయాలని రిజిస్ట్రార్‌ (మేనేజ్‌మెంట్‌)కు ఆదేశాలు జారీచేసింది. మోసం చేయడం ద్వారా న్యాయపాలనలో అక్రమంగా జోక్యం చేసుకున్నందుకు కోర్టు ధిక్కరణ చర్యలు ప్రారంభించాలని కూడా సూచించింది.


ఈ వార్తలు కూడా చదవండి:

దేవాదాయ శాఖలో అక్రమాలపై.. విజిలెన్స్‌ నివేదికలు బుట్టదాఖలు

పంటకు మురుగు నీరే దిక్కాయె!

ఓటరు నమోదుకు గ్రాడ్యుయేట్ల నిరాసక్తి!

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Oct 27 , 2026 | 06:03 AM