Share News

సైబరాబాద్ సీపీ రమేష్ రెడ్డికి జైలు శిక్ష విధించిన హైకోర్టు

ABN , Publish Date - Nov 26 , 2026 | 02:27 PM

జారీ చేసిన ఉత్తర్వులు అమలు చేయకుండా నిర్లక్ష్యం వహించడంపై సైబరాబాద్ పోలీస్ కమిషనర్ రమేష్ రెడ్డిపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయనకు రెండు వారాల జైలు శిక్షతోపాటు రూ.2 వేల జరిమానా విధించింది.

సైబరాబాద్ సీపీ రమేష్ రెడ్డికి జైలు శిక్ష విధించిన హైకోర్టు
Cyberabad Commissioner Ramesh Reddy

హైదరాబాద్, నవంబర్26: జారీ చేసిన ఉత్తర్వులు అమలు చేయకుండా నిర్లక్ష్యం వహించడంపై సైబరాబాద్ పోలీస్ కమిషనర్ రమేష్ రెడ్డిపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయనకు రెండు వారాల జైలు శిక్షతోపాటు రూ.2 వేల జరిమానా విధించింది. అలాగే మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డికి కూడా ఇదే శిక్షను హైకోర్టు విధించింది. అయితే వారం రోజులపాటు ఈ శిక్షపై హైకోర్టు సస్పెన్షన్ విధించినట్లు వెల్లడించింది. వారం రోజుల లోపు ఎలాంటి ఉత్తర్వులు తెచ్చుకోకుంటే.. హైకోర్టు రిజిస్ట్రార్‌ ముందు లొంగిపోయి శిక్ష అనుభవించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.


విధించిన జరిమానా చెల్లించకుంటే.. అదనంగా మరో వారం రోజులు జైలు శిక్ష అనుభవించాలని జారీ చేసిన ఉతర్వుల్లో తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. ఓ భూ వివాదంలో పిటిషనర్‌కు రక్షణ కల్పించాలంటూ సైబరాబాద్ కమిషనర్‌ రమేష్‌తోపాటు మేడ్చల్ డీసీపీకి తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ ఉత్తర్వుల పట్ల వారు ఉదాసీనంగా వ్యవహరించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ హైకోర్టు పైవిధంగా స్పందించింది.


ఇవి కూడా చదవండి..

‘ఐటీ కంపెనీల పనివేళలు మార్చాలి’.. సైబరాబాద్ ట్రాఫిక్‌పై డీజీపీ సీవీ ఆనంద్

లిక్కర్ షాపుల్లో వైద్య పరీక్షలు.. హడలిపోతున్న మందుబాబులు.. వీడియో వైరల్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Nov 26 , 2026 | 04:58 PM