Share News

ఎమ్మెల్యే హరీశ్ రావుకి భారీ ఊరట.. ఆ పర్యటనకు అనుమతులిచ్చిన హైకోర్టు..

ABN , Publish Date - Apr 08 , 2026 | 08:03 PM

సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావుకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. హరీశ్ రావుకు వనపర్తి జిల్లాలో పర్యటించేందుకు అనుమతినిస్తూ తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

ఎమ్మెల్యే హరీశ్ రావుకి భారీ ఊరట.. ఆ పర్యటనకు అనుమతులిచ్చిన హైకోర్టు..
MLA Harish Rao

హైదరాబాద్: సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావుకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. హరీశ్ రావుకు వనపర్తి జిల్లాలో పర్యటించేందుకు అనుమతినిస్తూ తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. హరీశ్ రావు పర్యటనకు అనుమతి లేదన్న జిల్లా ఎస్పీ ఆదేశాలను కొట్టివేస్తూ తీర్పునిచ్చింది. గొల్లపల్లి రిజర్వాయర్‌ను వ్యతిరేకిస్తూ స్థానిక రైతులు ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే, వారికి మద్దతుగా మాజీ మంత్రి అక్కడి పర్యటించి భారీ బహిరంగ సభ పెట్టాలని నిర్ణయించారు.


ఈ సభకు తొలుత జిల్లా ఎస్పీ అనుమతులు ఇచ్చారు. అనంతరం అకస్మాతుగా అనుమతులు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దీనిపై ఆగ్రహించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు.. తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తొలుత అనుమతులు ఇచ్చి ఆపై నిరాకరించారంటూ పిటిషన్ వేశారు. సభకు అనుమతులు ఇప్పించాలని న్యాయస్థానాన్ని కోరారు. దీనిపై నేడు ధర్మాసనం విచారణ చేపట్టగా.. శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందనే హరీశ్ రావుకి అనుమతి నిరాకరించినట్లు పోలీసుల తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు. ముందస్తు అనుమతి తీసుకున్నా చివరి నిమిషంలో నిరాకరించారని హరీశ్ రావు తరఫు న్యాయవాది తెలిపారు. ఇరువర్గాల వాదనలు విన్న ధర్మాసనం సభకు పర్మిషన్ ఇస్తూ ఆదేశాలిచ్చింది.


ఈ వార్తలు కూడా చదవండి

చోరీకి గురైన ద్విచక్రవాహనం.. మూడు నెలల తర్వాత ఈ-చలాన్..

తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. కొత్తగా రెండు విమానాశ్రయాలు..

Updated Date - Apr 08 , 2026 | 09:17 PM