ఐపీఎల్ 2026: టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్.. గుజరాత్ టైటాన్స్ గెలుపు ఖాతా తెరుస్తుందా?
ABN , Publish Date - Apr 08 , 2026 | 07:19 PM
ఐపీఎల్ 2026లో భాగంగా నేడు ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా కీలక పోరు జరగనుంది. టాస్ గెలిచిన ఢిల్లీ.. ఫీల్డింగ్ ఎంచుకుంది.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026లో భాగంగా నేడు ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా కీలక పోరు జరగనుంది. టాస్ గెలిచిన ఢిల్లీ.. ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో గుజరాత్ టైటాన్స్ తొలుత బ్యాటింగ్‌కు దిగనుంది. వరుస విజయాలతో ఊపు మీదున్న ఢిల్లీ.. హ్యాట్రిక్ కొట్టాలనే ఆత్మవిశ్వాసం బరిలోకి దిగబోతోంది. మరోవైపు గుజరాత్ టైటాన్స్ ఇప్పటి వరకు ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ పరాభవాన్ని చవి చూసింది. మరి ఈ మ్యాచ్‌తోనైనా గెలుపు ఖాతా తెరుస్తుందేమో చూడాల్సి ఉంది.
తిరిగొచ్చిన గిల్..
మెడ కండరాల గాయంతో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌కు జీటీ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ దూరమైన సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్‌లో వైస్ కెప్టెన్ రషీద్ ఖాన్ జట్టును నడిపించాడు. కాగా ఆ మ్యాచ్‌లో గుజరాత్ 6 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. కాగా ఢిల్లీతో మ్యాచ్‌కు గిల్ తిరిగి జట్టులో చేరాడు. కీలక సమయంలో గిల్ రీ ఎంట్రీ ఇవ్వడంతో.. అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
గుజరాత్ టైటాన్స్ తుది జట్టు..
శుభ్‌మన్ గిల్(కెప్టెన్), సాయి సుదర్శన్, జోస్ బట్లర్(వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, గ్లెన్ ఫిలిప్స్, షారుఖ్ ఖాన్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, రబాడా, సిరాజ్, అశోక్ శర్మ
ఇంపాక్ట్ సబ్‌స్టిట్యూట్స్: ప్రసిద్ధ్ కృష్ణ, జాసన్ హోల్డర్, మానవ్ సుతర్, జయంత్ యాదవ్, అనుజ్ రావత్
ఢిల్లీ క్యాపిటల్స్ తుది జట్టు..
కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), పాతుమ్ నిశాంక, నితీశ్ రాణా, విప్రాజ్ నిగమ్, అక్షర్ పటేల్(కెప్టెన్), డేవిడ్ మిల్లర్, స్టబ్స్, కుల్దీప్ యాదవ్, లుంగి ఎంగిడి, టి.నటరాజన్, ముకేశ్ కుమార్
ఇంపాక్ట్ సబ్‌స్టిట్యూట్స్: అశుతోశ్ శర్మ, ఆకిబ్ నబి, సమీర్ రిజ్వి, దుశ్మంత చమీరా, కరుణ్ నాయర్
ఇవి కూడా చదవండి:
ఎంఐపై హాఫ్ సెంచరీ మిస్.. వెక్కి వెక్కి ఏడ్చిన వైభవ్ సూర్యవంశీ
ఎంఐ-ఆర్ఆర్: మా ఓటమికి బౌలర్లే ప్రధాన కారణం.. హార్దిక్ పాండ్య