Share News

ప్రైజ్ ట్యాగ్ వల్లే సమస్యలన్నీ.. గ్రీన్‌కు కొంత విశ్రాంతినివ్వండి: ఆసీస్ మాజీ కెప్టెన్

ABN , Publish Date - Apr 08 , 2026 | 05:38 PM

ఐపీఎల్ 2026 వేలంలో కోల్‌కతా నైట్ రైడర్స్ కామెరూన్ గ్రీన్‌ను ఏకంగా రూ.25.20కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. తీరా చూస్తే.. ఫామ్ లేమితో ఇబ్బంది పడుతూ ఆశించిన స్థాయిలో ప్రదర్శన కనబర్చడం లేదు. ఈ నేపథ్యంలో ఆసీస్ మాజీ కెప్టెన్ ఆరోన్ ఫించ్ కీలక వ్యాఖ్యలు చేశాడు.

ప్రైజ్ ట్యాగ్ వల్లే సమస్యలన్నీ.. గ్రీన్‌కు కొంత విశ్రాంతినివ్వండి: ఆసీస్ మాజీ కెప్టెన్
Aaron Finch

ఇంటర్నెట్ డెస్క్: కామెరూన్ గ్రీన్.. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన ప్లేయర్. ఐపీఎల్ 2026 వేలంలో కోల్‌కతా నైట్ రైడర్స్ అతడిని ఏకంగా రూ.25.20కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. తీరా చూస్తే.. ఫామ్ లేమితో ఇబ్బంది పడుతూ ఆశించిన స్థాయిలో ప్రదర్శన కనబర్చడం లేదు. ఇదిలా ఉంటే.. పనిభారం కారణంగా అతడిని బౌలింగ్‌కు కూడా పంపడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో జట్టు వ్యూహాలపై ప్రశ్నలు తలెత్తడం సహజం. కామెరూన్ గ్రీన్ ఫామ్ విషయంలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఆరోన్ ఫించ్ కీలక వ్యాఖ్యలు చేశాడు.


‘గ్రీన్ బ్యాటింగ్ చేసే విషయంలో ఆత్మవిశ్వాసం లోపించింది. గతంలో అతడు ముంబై ఇండియన్స్‌కు ఆడినప్పుడు చూపిన దూకుడు ఇప్పుడు చూపించడం లేదు. క్రీజులో కొంత ఆందోళనగా కనిపిస్తున్నాడు. అతడిపై ప్రైజ్ ట్యాగ్ పడిందనడంలో సందేహమే లేదు. ఇలా ఒత్తిడి పెంచుతూ జట్టులో ఉంచే కంటే అతడికి కాస్త విశ్రాంతినివ్వండి. తర్వాత టాపార్డర్‌లో బ్యాటింగ్‌కు పంపండి. గ్రీన్ తిరిగి పుంజుకుంటాడని ఆశిస్తున్నా’ అని తెలిపాడు.


ఆ నిర్ణయం సరైంది కాదు..

పంజాబ్ కింగ్స్-కేకేఆర్ మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దు అయిన సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్‌లో కేకేఆర్ తీసుకున్న వ్యూహ నిర్ణయాలపై ఫించ్ విమర్శలు గుప్పించారు. వర్షం, మేఘావృత వాతావరణం ఉన్నప్పటికీ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోవడం సరైన నిర్ణయం కాదని పేర్కొన్నారు. ‘పిచ్ కవర్‌లో ఉండి, వర్షం పడే అవకాశం ఉన్నప్పుడు ముందుగా బ్యాటింగ్ చేయడం అర్థంలేని నిర్ణయం. ఇలాంటి పరిస్థితుల్లో రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేయడం డీఎల్ఎస్ పరంగా కూడా అనుకూలం’ అని అన్నాడు. కాగా ఆలస్యంగా ప్రారంభమైన ఆ మ్యాచ్ 3 ఓవర్ల దగ్గరే ఆగిపోయింది. అప్పటికే కేకేఆర్ 2 వికెట్లు కోల్పోయింది. వర్షం ఎంతకీ తగ్గకపోవడంతో మ్యాచ్‌ను రద్దు చేశారు.


ఇవి కూడా చదవండి:

ఎంఐపై హాఫ్ సెంచరీ మిస్.. వెక్కి వెక్కి ఏడ్చిన వైభవ్ సూర్యవంశీ

ఎంఐ-ఆర్ఆర్: మా ఓటమికి బౌలర్లే ప్రధాన కారణం.. హార్దిక్ పాండ్య

Updated Date - Apr 08 , 2026 | 05:38 PM