Share News

ఈ కుర్రాడిని వెంటనే టీమిండియాలోకి తీసుకోవడం ఉత్తమం.. బీసీసీఐకి ఇర్ఫాన్ పఠాన్ సూచన

ABN , Publish Date - Apr 08 , 2026 | 03:44 PM

యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ పరుగుల వరద పారిస్తున్నాడు. ఐపీఎల్ 2026లోనూ అతడి విధ్వంసం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్.. వైభవ్ సూర్యవంశీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అతడిని వెంటనే టీమిండియాలోకి తీసుకోవాలని బీసీసీఐకి సూచించాడు.

ఈ కుర్రాడిని వెంటనే టీమిండియాలోకి తీసుకోవడం ఉత్తమం.. బీసీసీఐకి ఇర్ఫాన్ పఠాన్ సూచన
Irfan Pathan

ఇంటర్నెట్ డెస్క్: యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ పరుగుల వరద పారిస్తున్నాడు. ఐపీఎల్ 2026లోనూ అతడి విధ్వంసం కొనసాగుతోంది. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 14 బంతుల్లో 5 సిక్సర్లు, ఒక ఫోర్ సాయంతో ఏకంగా 39 పరుగులు చేశాడు. ఎంఐ దిగ్గజ బౌలర్ బుమ్రా వేసిన తొలి బంతికే సిక్సర్ బాది అందరినీ ఆశ్చర్యపర్చాడు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్.. వైభవ్ సూర్యవంశీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అతడిని వెంటనే టీమిండియాలోకి తీసుకోవాలని బీసీసీఐకి సూచించాడు.


‘వైభవ్ సూర్యవంశీ ఓ యువ సంచలనం. 15 ఏళ్ల వయసులో వైట్ బాల్ క్రికెట్‌లో ఇలాంటి ప్రదర్శన మరెక్కడా చూడలేం. ‘నేను గతేడాది బుమ్రా బౌలింగ్‌లో ఔటయ్యాను. ఇప్పుడు అతడి బౌలింగ్‌లో ఎక్కువ స్కోర్ చేసేందుకు ఎదురుచూస్తున్నాను’ అని గతంలో సూర్యవంశీ చెప్పాడు. ఇప్పుడు నిజంగానే చెప్పిందే చేసి చూపించాడు. వైట్ బాల్ క్రికెట్‌లో బుమ్రాను ఎదుర్కోవడం చాలా కష్టం. కానీ వైభవ్ సూర్యవంశీ ఇప్పుడు ఆ గోల్‌ను కూడా రీచ్ అయ్యాడు. కాబట్టి ఈ కుర్రాడిని జాతీయ జట్టుకు ఎంపిక చేయడానికి ఎదురుచూడాల్సిన అవసరం లేదు. వెంటనే అతడిని టీమిండియాలోకి తీసుకోవడం ఉత్తమం. ఇలా అయితే వైభవ్ 20 ఏళ్ల పాటు ఈ వృత్తిలో కొనసాగగలడు’ అని ఇర్ఫాన్ వెల్లడించాడు.


ఇవి కూడా చదవండి:

ఎంఐపై హాఫ్ సెంచరీ మిస్.. వెక్కి వెక్కి ఏడ్చిన వైభవ్ సూర్యవంశీ

ఎంఐ-ఆర్ఆర్: మా ఓటమికి బౌలర్లే ప్రధాన కారణం.. హార్దిక్ పాండ్య

Updated Date - Apr 08 , 2026 | 03:44 PM