Share News

ప్రాణం తీసే హక్కు పోలీసులకు లేదు

ABN , Publish Date - Nov 24 , 2026 | 05:57 AM

ఒక పౌరుని ప్రాణాలు తీసే అధికారం ప్రభుత్వం లేదా ప్రభుత్వ సంస్థలకు లేదని రాష్ట్ర హైకోర్టు స్పష్టం చేసింది.

ప్రాణం తీసే హక్కు పోలీసులకు లేదు

  • బాధిత కుటుంబానికి పరిహారం ఇవ్వాలని హైకోర్టు ఆదేశం

హైదరాబాద్‌, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి) : ఒక పౌరుని ప్రాణాలు తీసే అధికారం ప్రభుత్వం లేదా ప్రభుత్వ సంస్థలకు లేదని రాష్ట్ర హైకోర్టు స్పష్టం చేసింది. పాతికేళ్ల క్రితం ఓ ఫేక్‌ ఎన్‌కౌంటర్‌లో ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి భార్యకు రూ.2 లక్షలు పరిహారం చెల్లించాలని ఈనెల 16న తీర్పు ఇచ్చింది. 2001 అక్టోబర్‌లో అప్పటి తీవ్రవాద సంస్థ పీపుల్స్‌వార్‌ సభ్యులు అప్పటి ఎస్సైని కిడ్నాప్‌ చేసినట్టు కేసు నమోదైంది.


అందుకు సహకరించిన కొంతమందిలో మెదక్‌ జిల్లా చేగుంట మండలం చెట్ల తిమ్మాయపల్లికి చెందిన బాలనర్సయ్య ఉన్నట్లు కేసు నమోదైంది. బాలనర్సయ్య లొంగిపోయినా, పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేశారని మృతుని భార్య పొన్న వెంకటమ్మ 2002లో హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై ఇటీవల జస్టిస్‌ సుద్దాల చలపతిరావు ధర్మాసనం తీర్పు ఇచ్చింది. పిటిషనర్‌ భర్త మరణానికి కారణమైనందుకు చేగుంట ఎస్సై, మెదక్‌ ఎస్పీ, రాష్ట్ర హోంశాఖ రూ.2లక్షలు చెల్లించాలని తుది తీర్పు ప్రకటించింది.


ఈ వార్తలు కూడా చదవండి...

గ్రామాల్లో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరగాలి: పవన్ కల్యాణ్

వైసీపీకి మిగిలేది కక్షలు, అప్పులే.. సోమిరెడ్డి సెటైర్లు

ఏపీలో మేయర్లు, ఛైర్‌పర్సన్ల ప్రమాణ స్వీకారానికి వేళాయే..

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Nov 24 , 2026 | 05:57 AM