ధిక్కరణ కేసులో కోర్టుకు హాజరైన దానకిశోర్
ABN , Publish Date - Nov 26 , 2026 | 04:59 AM
మహబూబ్‌నగర్ మునిసిపాలిటీలో పనిచేస్తున్న కొంతమంది మునిసిపల్ ఉద్యోగులకు సంబంధించిన సర్వీసు వివాదంలో దాఖలైన కోర్టు ధిక్కరణ పిటిషన్‌లో ప్రతివాది, ఎంఏయూడీ ముఖ్యకార్యదర్శిగా పనిచేసి రిటైర్ అయిన ఐఏఎస్ దాన కిశోర్ బుధవారం హైకోర్టు ఎదుట హాజరయ్యారు.
హైదరాబాద్, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): మహబూబ్‌నగర్ మునిసిపాలిటీలో పనిచేస్తున్న కొంతమంది మునిసిపల్ ఉద్యోగులకు సంబంధించిన సర్వీసు వివాదంలో దాఖలైన కోర్టు ధిక్కరణ పిటిషన్‌లో ప్రతివాది, ఎంఏయూడీ ముఖ్యకార్యదర్శిగా పనిచేసి రిటైర్ అయిన ఐఏఎస్ దాన కిశోర్ బుధవారం హైకోర్టు ఎదుట హాజరయ్యారు. పిటిషనర్లు అయిన ఉద్యోగుల సర్వీసు రెగ్యులరైజేషన్ గురించి తాను చర్యలు తీసుకున్నట్లు.. రిటైర్ అయ్యాక కూడా ఈ తీర్పు అమలయ్యేలా చర్యలు తీసుకున్నట్లు అఫిడవిట్ దాఖలు చేశారు. ఈ కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్ టీ మాధవీదేవి ధర్మాసనం.. దాన కిశోర్ తీరుపై అసహనం వ్యక్తం చేసింది.
ప్రతివాది ఇచ్చిన వివరణ పట్ల సంతృప్తికరంగా లేదని.. ప్రతివాది ఎంఏయూడీ ముఖ్యకార్యదర్శిగా సర్వీసులో ఉన్నప్పుడు కూడా తీర్పు అమలుకు తగిన చర్యలు తీసుకోలేదని పేర్కొంది. ఈ నేపథ్యంలో గత తీర్పును అమలు చేయించడంలో భాగంగా ప్రస్తుత కోర్టు ధిక్కరణ పిటిషన్‌లో సుమోటోగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్)ను ఇంప్లీడ్ చేయడంతోపాటు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీచేస్తున్నట్లు పేర్కొంది. గత తీర్పు అమలు కాకపోతే డిసెంబర్ 23న సీఎస్ వ్యక్తిగతంగా కానీ లేదా తన న్యాయవాది ద్వారా కానీ హాజరుకావాలని స్పస్టంచేసింది. తదుపరి విచారణ డిసెంబర్ 23కు వాయిదా పడింది.
ఈ వార్తలు కూడా చదవండి:
అక్రమ అండాల కేసులో ఇద్దర్ని కస్టడీకి అప్పగించాలి
ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే బీజేపీని ఓడించాలి: జాన్ వెస్లీ
Read Latest AP News And Telangana News And International News And Telugu News