Share News

మత్స్య సొసైటీలకు ఎన్నికలు జరపని అధికారులు

ABN , Publish Date - Oct 27 , 2026 | 06:23 AM

ప్రాథమిక మత్స్య సహకార సొసైటీల ఎన్నికల వివాదం కోర్టు ధిక్కరణ నోటీసులకు దారితీసింది.

మత్స్య సొసైటీలకు ఎన్నికలు జరపని అధికారులు
Telangana High Court

  • సీఎస్‌ సహా పలువురు ఐఏఎస్‌లకు కోర్టు ధిక్కరణ నోటీసులు

హైదరాబాద్‌, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): ప్రాథమిక మత్స్య సహకార సొసైటీల ఎన్నికల వివాదం కోర్టు ధిక్కరణ నోటీసులకు దారితీసింది. ప్రాథమిక మత్స్యసహకార సొసైటీలు, జిల్లా సొసైటీలకు ఎన్నికలు నిర్వహించాలని, మత్స్య సహకార సొసైటీల ఫెడరేషన్‌ సహా ఏ సొసైటీలకు పర్సన్‌ ఇన్‌ఛార్జి లేదా నామినేటెడ్‌ కార్యవర్గాలను ఏర్పాటు చేయరాదని గతంలో న్యాయవాది డీఎల్‌ పాండు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన జస్టిస్‌ సూరేపల్లి నంద ధర్మాసనం.. మూడువారాల్లో ఎన్నికలు నిర్వహించాలని తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు అమలు చేయలేదని పేర్కొంటూ హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్‌ దాఖలైంది.


పరిశీలించిన ధర్మాసనం.. తమ ఉత్తర్వులను ఎందుకు పాటించలేదో వివరణ ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వ్యవసాయ, సహకారశాఖ ముఖ్యకార్యదర్శి, పశుసంవర్ధశాఖ ముఖ్యకార్యదర్శి, మత్స్యశాఖ కమిషనర్‌, సహకారశాఖ ఎన్నికల అధికారి, తదితరులకు ధిక్కరణ నోటీసులు జారీచేసింది. నవంబర్‌ 20న వివరణ ఇవ్వాలని.. లేనిపక్షంలో పరోక్షంలో ఉత్తర్వులు జారీచేస్తామని పేర్కొంది. కాగా, గిరిజన సంక్షేమ శాఖలో వాచ్‌మెన్‌, గ్రేడెడ్‌ వర్కర్ల ఉద్యోగాల క్రమబద్ధీకరణకు సంబంధించిన ఓ కోర్టు ధిక్కరణ కేసులో ఆర్థికశాఖ ప్రత్యేక కార్యదర్శి సిక్తా పట్నాయక్‌ ఆన్‌లైన్‌లో, గిరిజన సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి సంతోష్‌ ప్రత్యక్షంగా జస్టిస్‌ మాధవీదేవి ధర్మాసనం ఎదుట జరయ్యారు. పిటిషనర్‌లకు అనుకూలంగా ఇచ్చిన తీర్పును అమలు చేయాలని, నవంబర్‌ 23న అందుకు సంబంధించిన నివేదికను సమర్పించాలని న్యాయమూర్తి ఆదేశించారు.


ఈ వార్తలు కూడా చదవండి:

దేవాదాయ శాఖలో అక్రమాలపై.. విజిలెన్స్‌ నివేదికలు బుట్టదాఖలు

పంటకు మురుగు నీరే దిక్కాయె!

ఓటరు నమోదుకు గ్రాడ్యుయేట్ల నిరాసక్తి!

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Oct 27 , 2026 | 06:23 AM