Share News

గురుకులాలకు సరుకుల సరఫరాలో నిర్లక్ష్యాన్ని సహించం: మంత్రి అడ్లూరి లక్ష్మణ్

ABN , Publish Date - Nov 13 , 2026 | 08:43 PM

గురుకుల విద్యార్థులకు సరుకులు, కిట్ల సరఫరాలో జాప్యంపై ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ శాఖామంత్రి అడ్లూరి లక్ష్మణ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ మేరకు గడువులోగా సరుకులను సరఫరా చేయకపోతే టెండర్ నిబంధన ప్రకారం చర్యలు తీసుకుంటామని మఫత్లాల్ సంస్థకు హెచ్చరికలు జారీ చేశారు.

గురుకులాలకు సరుకుల సరఫరాలో నిర్లక్ష్యాన్ని సహించం: మంత్రి అడ్లూరి లక్ష్మణ్
telangana gurukul student supplies

హైదరాబాద్, నవంబర్ 13: గురుకుల విద్యార్థులకు సరుకులు, కిట్ల సరఫరాలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు మఫత్లాల్ ఇండస్ట్రీస్ సంస్థకు హెచ్చరికలు జారీ చేశారు.


గురుకుల విద్యార్థులకు పెండింగ్‌లో ఉన్న 2 వేల జతల తెల్ల సాక్సులు, 3 వేల ట్రంకు పెట్టెలను గడువులోగా సరఫరా చేయాలని.. లేదంటే.. టెండర్ నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి అడ్లూరి.. మఫత్లాల్ ఇండస్ట్రీస్ సంస్థకు హెచ్చరికలు జారీ చేశారు. కాగా.. ఈ నెల 16లోగా పెండింగ్ సరుకులన్నీ అందిస్తామని మఫత్లాల్ సంస్థ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.

గురుకుల విద్యార్థులకు సరఫరా చేసే సరుకుల విషయంలో మంత్రి సంబంధిత అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రతీ వస్తువు నాణ్యతను క్షుణ్ణంగా పరిశీలించాలని ఆదేశించారు. ఈ క్రమంలో ప్రతి జిల్లాకు నోడల్ అధికారిని నియమించి సరఫరాలను పర్యవేక్షించాలని సూచించారు. గురుకులాల్లో నిత్యావసరాల కొరత రాకుండా బఫర్ స్టాక్‌ను తప్పనిసరిగా నిర్వహించాలని ఆదేశించారు. నవంబర్ 25లోగా సరఫరా పురోగతిపై ఆయనకు సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. కాగా.. ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల సంక్షేమంలో నిర్లక్ష్యాన్ని సహించేది లేదని.. విద్యార్థులకు నాణ్యమైన భోజనం, సరుకులు సకాలంలో అందేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.


ఈ వార్తలూ చదవండి

నాతో చర్చకు వస్తే ప్రధాని పదవిలో మోదీ కొనసాగలేరు.. రాహుల్ గాంధీ సవాల్..

సంప్రదాయాలకు భిన్నంగా అనిరుధ్‌-కావ్య వివాహ వేడుక.. ఏమిటా పెళ్లి పద్ధతి..

Updated Date - Nov 13 , 2026 | 08:44 PM