గడువులోగా గురుకుల విద్యార్థులకు.. సరుకులు, కిట్ల సరఫరా పూర్తిచేయాలి:అడ్లూరి
ABN , Publish Date - Nov 14 , 2026 | 04:46 AM
ప్రభుత్వ వసతి గృహాలు, గురుకులాలు, కేజీబీవీలు, ప్రభుత్వ విద్యాలయాల్లోని విద్యార్థులకు నాణ్యమైన నిత్యావసర సరుకులు, విద్యా సామగ్రి, స్టూడెంట్ కిట్లను నిర్ణీత గడువులోగా అందించడంలో ఎలాంటి జాప్యం జరిగినా సహించేది లేదని సాంఘిక సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ హెచ్చరించారు.
హైదరాబాద్, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వ వసతి గృహాలు, గురుకులాలు, కేజీబీవీలు, ప్రభుత్వ విద్యాలయాల్లోని విద్యార్థులకు నాణ్యమైన నిత్యావసర సరుకులు, విద్యా సామగ్రి, స్టూడెంట్ కిట్లను నిర్ణీత గడువులోగా అందించడంలో ఎలాంటి జాప్యం జరిగినా సహించేది లేదని సాంఘిక సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ హెచ్చరించారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల ఆహారం, వసతి, నిత్యావసరాల సరఫరాలో నిర్లక్ష్య్ం వహిస్తే ఎంతటి వారినైనా వదిలిపెట్టకుండా బాధ్యులను చేసి చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. గురుకుల విద్యా సంస్థలకు ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ ద్వారా జరుగుతున్న సరఫరాలపై శుక్రవారం సచివాలయంలో మంత్రి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ క్రమంలో వివిధ శాఖల కార్యదర్శులు, ఉన్నతాధికారుల నుంచి సరఫరా పురోగతి, పెండింగ్‌లో ఉన్న వస్తువులు, వాటి నాణ్యత, క్షేత్ర స్థాయిలో పర్యవేక్షణ తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. టెండర్లు దక్కించుకున్న వారు నిర్ణీత గడువులోగా వస్తువులను సరఫరా చేయకపోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. మఫత్‌లాల్ సంస్థ సరఫరాల్లో పెండింగ్‌ను ప్రస్తావించి ఆగ్రహం వ్యక్తం చేశారు. 2000 జతల సాక్సులు, 3000 ట్రంకు పెట్టెల సరఫరా పెండింగ్‌లో పడినట్లు ఈ సమీక్షలో వెల్లడైంది. నిర్ణీత గడువులోగా సరఫరా చేయకపోతే టెండర్ నిబంధనల్లోని షరతుల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఈ విషయంలో పీఎంయూ చైర్మన్ తగిన చర్యలు తీసుకోవాలని ఆయన స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. మంత్రి ఆగ్రహంతో స్పందించిన మఫత్‌లాల్ ప్రతినిధి పెండింగ్‌లో ఉన్న అన్ని వస్తువులను ఈ నెల 16వ తేదీలోపు సరఫరా చేస్తామని మంత్రికి హామీ ఇచ్చారు.
ఈ వార్తలు కూడా చదవండి..
రాహుల్‌పై కక్ష.. తెలంగాణపై వివక్ష
ఆంధ్రజ్యోతి- ఏబీఎన్ కొత్త కార్యాలయానికి సీఎం రేవంత్
Read Latest Telangana News And AP News And National News
And Telugu News