Share News

గ్రామ పంచాయతీలకు గ్రేడింగ్‌..!

ABN , Publish Date - Nov 07 , 2026 | 04:32 AM

రాష్ట్రంలో కొత్త గ్రామ పంచాయతీల ఏర్పాటుతో పెరిగిన సంఖ్యకు అనుగుణంగా పరిపాలనా వ్యవస్థను పునర్వ్యవస్థీకరించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

గ్రామ పంచాయతీలకు గ్రేడింగ్‌..!
Gram Panchayat Grading

  • 12,760 పంచాయతీల వర్గీకరణకు కసరత్తు

  • ప్రభుత్వానికి రూ. 40.71కోట్ల అదనపు భారం!

  • 15 లక్షలకు పైగా ఆదాయమున్న పంచాయతీలు 1,619 మాత్రమే

  • 5 లక్షల్లోపు ఆదాయం ఉన్నవి 4,332

హైదరాబాద్‌, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కొత్త గ్రామ పంచాయతీల ఏర్పాటుతో పెరిగిన సంఖ్యకు అనుగుణంగా పరిపాలనా వ్యవస్థను పునర్వ్యవస్థీకరించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అందులో భాగంగానే రాష్ట్రంలోని 12,760 గ్రామ పంచాయతీలకు గ్రేడింగ్‌ను ఖరారు చేయడంతో పాటు కార్యదర్శుల పోస్టులను క్రమబద్ధీకరించేందుకు పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్థిశాఖ కమిషనర్‌ డి.దివ్య ప్రభుత్వానికి సమగ్ర నివేదిక సమర్పించారు. కొత్త గ్రేడింగ్‌ వల్ల రూ. 40.71కోట్ల వరకు అదనపు బడ్జెట్‌ అవసరమని అంచనా వేసిన అధికారులు.. పంచాయతీలను వర్గీకరించేందుకు రెండు విభిన్న ప్రతిపాదనలను నివేదికలో పొందుపరిచారు.


తొలి ప్రతిపాదన ప్రకారం.. జోన్లవారీగా గ్రామ పంచాయతీల సంఖ్యను ప్రాతిపదికగా తీసుకుని 12,760 పంచాయతీలను నిర్దిష్ట శాతం మేరకు నాలుగు గ్రేడ్లు కేటాయించాలని సూచించారు. గ్రేడ్‌- 1 కేటగిరీలో 1,914, గ్రేడ్‌- 2లో 2,552, గ్రేడ్‌- 3లో 3,190, గ్రేడ్‌- 4లో 5,104 పంచాయతీలుగా విభజించాలని నిర్ణయించారు. ఇక రెండో ప్రతిపాదన ప్రకారం.. గ్రామ పంచాయతీల వార్షిక ఆదాయమే ప్రామాణికంగా గ్రేడింగ్‌ ఖరారు చేస్తారు. 15 లక్షలకు పైగా వార్షిక ఆదాయం ఉన్న 1,619 గ్రామపంచాయతీలను గ్రేడ్‌- 1 పరిధిలో, 10 లక్షల నుంచి రూ.15 లక్షల ఆదాయం ఉన్న 1,915 పంచాయతీలను గ్రేడ్‌- 2లో, 5 లక్షల నుంచి 10 లక్షల లోపు ఆదాయం ఉన్న 4,894 పంచాయతీలను గ్రేడ్‌- 3గా, 5 లక్షల్లోపు వార్షిక ఆదాయం కలిగిన 4,332 పంచాయతీలను గ్రేడ్‌- 4గా కేటాయించనున్నారు. పంచాయతీరాజ్‌శాఖ ప్రతిపాదించిన ఈ రెండు ప్రతిపాదనల్లో దేనికి ఆమోదముద్ర వేయాలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.


గ్రేడింగ్‌ ఖరారైతే కార్యదర్శుల పదోన్నతులకు మార్గం సుగమం

గ్రేడింగ్‌ విధానం అమల్లోకి వేస్త పంచాయతీ కార్యదర్శుల పోస్టుల పునర్వ్యవస్థీకరణకు అవకాశం ఏర్పడుతుంది. వివిధ గ్రేడ్లలో పోస్టుల సంఖ్య పెరగడంతో సుదీర్ఘకాలంగా పదోన్నతుల కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగులకు ఊరట లభించనుంది. ప్రస్తుతం పంచాయతీ కార్యదర్శుల వ్యవస్థలో గ్రేడ్‌-1 నుంచి గ్రేడ్‌-4 వరకు పోస్టుల విభజన ఉన్నప్పటికీ, కొత్త గ్రామ పంచాయతీల ఏర్పాటుతో సరిపడా పోస్టులు అందుబాటులో లేక పలువురు కార్యదర్శులు పదోన్నతులకు దూరమయ్యారు. పీఆర్‌శాఖ ప్రతిపాదన మేరకు గ్రామ పంచాయతీలకు గ్రేడింగ్‌ ఖరారైతే తమ పదోన్నతులకు మార్గం సుగమం అవుతుందని పంచాయతీ కార్యదర్శులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

కాళేశ్వరంపై అసెంబ్లీ!

మరో రెండు పథకాలు

కొడంగల్‌లో రేపటి నుంచి సీఎం పర్యటన

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Nov 07 , 2026 | 04:34 AM