Share News

ఎమ్మెల్సీ ఓటరు నమోదు గడువును పెంచండి

ABN , Publish Date - Nov 03 , 2026 | 06:21 AM

రాష్ట్రంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు గడువును మరికొన్ని రోజుల పాటు పొడిగించాలంటూ కేంద్ర ఎన్నికల కమిషన్‌కు హైదరాబాద్‌ ఇన్‌చార్జ్‌ మంత్రి పొన్నం ప్రభాకర్‌ విజ్ఞప్తి చేశారు.

ఎమ్మెల్సీ ఓటరు నమోదు గడువును పెంచండి
Ponnam Prabhakar

  • ఎన్నికల సంఘానికి పొన్నం విజ్ఞప్తి

హైదరాబాద్‌, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు గడువును మరికొన్ని రోజుల పాటు పొడిగించాలంటూ కేంద్ర ఎన్నికల కమిషన్‌కు హైదరాబాద్‌ ఇన్‌చార్జ్‌ మంత్రి పొన్నం ప్రభాకర్‌ విజ్ఞప్తి చేశారు. ఈ నెల 6న ఓటరు నమోదు గడువు ముగుస్తుందని.. అయితే దసరా, దీపావళి పండుగలు మధ్యలో రావడంతో చాలామంది అర్హులైన ఓటర్లు తమ పేర్లను ఓటరు జాబితాలో నమోదు చేయించుకోలేకపోయారని తెలిపారు. వారందరికీ అవకాశం కల్పించేందుకు తుది గడువును మరికొన్ని రోజుల పాటు పొడిగించాలని కోరారు. అర్హులైన పట్టభద్రులందరూ తప్పనిసరిగా తమ ఓటు హక్కును నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు.


రాష్ట్ర మహిళా కాంగ్రెస్‌కు కొత్త కార్యవర్గం

రాష్ట్ర మహిళా కాంగ్రెస్‌కు కొత్త కార్యవర్గం ఖరారైంది. మొత్తం 12 మంది ఉపాధ్యక్షులు, 10 మంది ప్రధాన కార్యదర్శులు, 11 మంది సంయుక్త కార్యదర్శులతో కొత్త కార్యవర్గాన్ని ఏఐసీసీ ఖరారు చేసినట్లు తెలిసింది. 20కి పైగా జిల్లాలకు అధ్యక్షుల పేర్లూ ఖరారైనట్లు సమాచారం. ఒకటి, రెండు రోజుల్లో దీనికి సంబంధించి ప్రకటన వెలువడనుంది. రాష్ట్ర మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ నియామకం తర్వాత.. కొత్త కార్యవర్గం ఏర్పాటు చేయాల్సి ఉన్నా ఇన్నాళ్లుగా పెండింగ్‌లోనే ఉంది.


ఈ వార్తలు కూడా చదవండి..

ఉద్యమంలోకి వెళ్లి జీవితం పాడు చేసుకున్నా!

అమిత్‌షా పర్యటనతో తెలంగాణకు ఒరిగిందేమీ లేదు

సందిగ్ధతకు తావు లేకుండా ఎస్సీ వర్గీకరణ

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 03 , 2026 | 06:21 AM