పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు గడువు పెంపు
ABN , Publish Date - Nov 04 , 2026 | 04:02 AM
షెడ్యూల్ ప్రకారం పట్టభద్రుల ముసాయిదా ఓటరు జాబితాను ఈనెల 25న వెలువరిస్తామని, ఆరోజు నుంచి డిసెంబర్ 10 వరకు అభ్యంతరాలను స్వీకరిస్తామని ప్రధాన ఎన్నికల అధికారి సి.సుదర్శన్‌రెడ్డి తెలిపారు.
నామినేషన్ల చివరి తేదీ వరకు ఓటు నమోదుకు అవకాశం
25న పట్టభద్రుల ముసాయిదా ఓటరు జాబితా
నామినేషన్ల వరకు ఓటు నమోదుకు అవకాశం: సీఈఓ
హైదరాబాద్, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి): షెడ్యూల్ ప్రకారం పట్టభద్రుల ముసాయిదా ఓటరు జాబితాను ఈనెల 25న వెలువరిస్తామని, ఆరోజు నుంచి డిసెంబర్ 10 వరకు అభ్యంతరాలను స్వీకరిస్తామని ప్రధాన ఎన్నికల అధికారి సి.సుదర్శన్‌రెడ్డి తెలిపారు. అయితే ఓటు హక్కు నమోదు దరఖాస్తు సమర్పణకు మాత్రం ఈనెల 6 వరకు కాకుండా ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్ల దాఖలు చివరి తేదీ వరకు అవకాశం కల్పిస్తున్నట్లు మంగళవారం ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
రెండు రోజులుగా ఓటరు నమోదుకు సంబంధించి.. సీఈఓ అధికారిక పోర్టల్ మొరాయించడంతో పట్టభద్రులు ఇబ్బంది పడాల్సివస్తోందని, ఆన్లైన్ ప్రక్రియ నిలిచిపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. త్వరలోనే సమస్యలను పరిష్కరించి సేవలన్నీ పునరుద్ధరిస్తామన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
‘క్యూర్’లో అంధకారానికి చెక్!
Read Latest AP News And Telangana News And International News And Telugu News